Live Updates
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం: నెతన్యాహు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం: నెతన్యాహు వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనై మరణించి ఉండవచ్చన్న సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ఛానల్ 12 న్యూస్ ప్రకారం, శనివారం జరిగిన అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్లో ఖమెనై నివాస సముదాయంపై 30 బాంబులు వేశారని సమాచారం.
చానల్ 12 జర్నలిస్ట్ అమిత్ సెగల్ మాట్లాడుతూ ఆ సముదాయంపై 30 బాంబులు వేశారు. అలీ ఖమెనై భూగర్భంలో ఉన్నారు, కానీ ఆయన స్వంత బంకర్‌లో కాకపోవచ్చు, అని పేర్కొన్నారు.
అయితే, ఈ సమాచారం కోసం ఆయన ఎటువంటి ప్రత్యక్ష ఆధారాన్ని చూపలేదని నివేదికలో స్పష్టం చేశారు.
భారత అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం
- ఇజ్రాయెల్ -ఇరాన్ దాడులు నేపథ్యంలో భారత అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం.
- గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 12.30 కి 175 మంది ప్రయాణికులతో షార్జా బయలుదేరి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం.
- యుద్ధం కారణంగా షార్జాలో విమానాశ్రయం మూసివేత.
- విమానాన్ని ముంబై తరలించిన అధికారులు.
- షార్జా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రాత్రి 8.15కి తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టు కి వచ్చిన విమానం.
- వారివారి స్వస్థలాలకు వెళ్లిపోతున్న ప్రయాణికులు.
దుబాయ్‌లోని అన్ని విమాన సర్వీసులు రద్దు
- దుబాయ్‌లోని అన్ని విమాన సర్వీసులు రద్దు
- ప్రయాణికులు పడిగాపులు
- వార్ కారణంగా విమాన సర్వీసుల రద్దు చేసిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్ విభాగం
దుబాయ్‌లోని హెటల్‌పై ఇరాన్ దాడులు
- దుబాయ్‌లోని హెటల్‌పై ఇరాన్ దాడులు
- పామ్ హోటల్ రిసార్ట్‌పై దాడులు
- భయానక వాతావరణంలో దుబాయ్ ప్రజలు
BIG BREAKING NEWS 🚨 Iranian strikes hit famous "Palm Hotel & Resort" in Dubai 😳 pic.twitter.com/iSDVx8lP8Q https://t.co/It5PPzQWAc
— News Algebra (@NewsAlgebraIND) February 28, 2026
14 యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు చేశాం: ఇరాన్
- 14 యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు: ఇరాన్
- వందల మంది అమెరికా సైనికులు మృతి అంటూ ఇరాన్ ప్రకటన
భారత ఎయిర్‌పోర్టులకు దుబాయ్ ఎఫెక్ట్
- ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
- ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సూచనలు
- ఇరాన్-ఇజ్రాయిల్ వార్ కారణంగా విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే అవకాశం
- ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు చేరుకునే ముందు విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచన
ఇరాన్ దాడులపై సౌదీ అరేబియా ఆగ్రహం
- తాము తటస్థంగా ఉంటామని చెప్పినప్పటికీ ఇరాన్ దాడులు చేయడం పిరికిపంద చర్య
- దాడులు చేయడం పిరికిపంద చర్య
ఇరాన్- ఇజ్రాయిల్ వార్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన
పరస్పరం దాడులు అంతర్జాతీయ శాంతి భద్రతలకు విఘాతం
తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలి
శాంతియుతంగా వివాదాన్ని పరిష్కరించుకోండి
ఖమేనీ మృతి అంటూ ఇజ్రాయిల్ మీడియాలో వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిచెందినట్లు ఇజ్రాయెల్ మీడియా వార్తలు
- అంత సీన్ లేదంటున్న ఇరాన్
- మా నాయకుడు సురక్షితంగా ఉన్నాడు
- మా నాయకుడు ఆచూకీ కనుగోవడం మీకు అంత ఈజీ కాదు
- మా నాయకుడితో పాటు కీలక నేతలంతా సేఫ్‌గానే ఉన్నారు
ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధంలో కీలక పరిణామం
- హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేసిన ఇరాన్
- జలసంధిలో అన్ని నౌకలను నిలిపేసిన ఇరాన్
- హర్మూజ్ జలసంధి నుంచి 30 శాతం ముడిచమురు రవాణా
- ఇరాన్ నిర్ణయంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం
అమెరికాకు ఇరాన్ మినిస్టర్ కౌంటర్
- ఇరాన్‌లోపాలనను మార్చాలని అనుకోవడం ఎవరి వల్ల కాదు.. అది సాధ్యం కాదు
- మమ్మల్ని మేము కాపాడుకోగలం. ఎవరి సాయం అవసరం లేదు
- ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకునేందుకు మేము సిద్ధం
ఇరాన్ క్షిపణులు వర్షం.. ఇచిలోవ్‌లో భయానక వాతావరణం
- ఇరానియన్ క్షిపణుల వర్షం కురుస్తుండటంతో ఇజ్రాయిల్‌లోని ఇచిలోవ్ ఆసుపత్రిలో రోగులు అండర్ గ్రౌండ్‌లోకి పరుగులు

ఇరాన్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు మృతి
- ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు మృతి
- ఇరాన్ రక్షణమంత్రి అమీర్ నాసిర్జాదే మృతి
- ఇరాన్ గార్డ్స్ కమాండర్ పక్సూర్ మృతి
- ఇద్దరూ ఇజ్రాయిల్ దాడుల్లో చనిపోయినట్లు రాయిటర్స్ కథనం
ఇరాన్ వ్యూహాత్మక రక్షణ వ్యవస్థపై ఐడీఎఫ్ విస్తృత దాడి
ఇరాన్ వ్యూహాత్మక రక్షణ వ్యవస్థపై ఐడీఎఫ్ విస్తృత దాడులు
పశ్చిమ ఇరాన్‌లోని కెర్మాన్‌షా ప్రాంతంలో ఉన్న అధునాతన SA-65 వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి
పశ్చిమాసియా పరిణామాలపై స్పందించిన భారత్
ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాలి: భారత విదేశాంగశాఖ
ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరిన భారత్
ఇరాన్‌లో ఆగిపోయిన ఇంటర్నెట్
- ఇరాన్ నుంచి పారిపోయేందుకు ప్రజలు యత్నాలు
- మా ఆర్మీ చీఫ్ చనిపోలేదు: ఇరాన్ స్టేట్ మీడియా
- ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరగాలి: యూకే,ఫ్రాన్స్, జర్మనీ పిలుపు
- ఇరాన్ దాడుల్లో కువైట్ ఎయిర్‌బేస్ ధ్వంసం
రంగంలోకి సౌదీ అరేబియా
- ఇరాన్‌పై యుధ్దానికి సిద్ధమవుతున్న సౌదీ అరేబియా
- ఇరాన్‌ను కట్టడి చేయకపోతే తమ ఉనికికే ప్రమాదం రావడంతో సౌదీ అరేబియా యుద్ధానికి సన్నాహాలు
- మిత్ర దేశాలను ఏకం చేసే పనిలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్
- కువైట్ ఎమిర్ , ఖతార్ ఎమిర్‌తో ఫోన్లలో చర్చలు
- ఇరాన్‌కు వ్యతిరేకంగా దళాలు చేరతారని మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆశాభావం
- యుఎఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్‌లకు మద్దతు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను మోహరిస్తున్న సౌదీ అరేబియా

టెహ్రాన్‌లోని అలీ ఖమేనీ నివాసం: నేటి దాడికి ముందు.. తరువాత

మరిన్ని దాడులకు ఇజ్రాయిల్ సన్నద్ధం
మరిన్ని దాడులకు సన్నద్ధమవుతున్న ఇజ్రాయిల్
ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లను సిద్ధం చేస్తున్న ఇజ్రాయిల్
ట్రంప్‌కు ఇరాన్ సైన్యం హెచ్చరికలు
- మేం ఇప్పటికి వరకు పాత ఆయుధాలే వాడాం: ఇరాన్
- కొత్త ఆయుధాలు ప్రయోగిస్తే ట్రంప్ తట్టుకోలేరు
- ఇరాన్ దుందుడుకు చర్యలు తప్పుబట్టిన ఖతార్
- దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అన్ని విమాన సర్వీసులు నిలిపివేత
- ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు రావొద్దని సూచన
టెల్ అవిల్‌లో 28 బస్సులు దగ్ధం
ఇరాన్ దాడి: టెల్ అవిల్‌లో 28 బస్సులు దగ్ధం
ఈ యుద్ధాన్ని వెంటనే ఆపండి: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
- ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ స్పందన
- ఈ యుద్ధం మానవాళికి తీవ్ర నష్టం
- ఈ యుద్ధాన్ని వెంటనే ఆపండి
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయిస్తున్న అధికారులు
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసాలపై దాడులు
- ఇరాన్ ప్రెసిడెంట్ పిజిష్కియెన్ నివాసాలపై దాడులు
- ఇజ్రాయిల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ దాడులు
- దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయిస్తున్న అధికారులు
ఇజ్రాయిల్, అమెరికా తీరుపై రష్యా ధ్వజం
- ఇజ్రాయిల్, అమెరికా తీరుపై రష్యా ఆగ్రహం
- వరల్డ్ ఆర్డర్‌ను మార్చేలా అమెరికా నాయకత్వం వ్యవహరిస్తోంది
- ఇది సరైనది కాదు
మినాబ్‌లోని స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
- 36 మంది విద్యార్థుల మృతి
- ఇరాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ వైమానిక దాడులు
- శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు
- ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- పశ్చిమాసియాకు వెళ్తే విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఎయిర్‌లైన్స్
- పశ్చిమాసియా ఘర్షణలతో వెనక్కి తిరగొచ్చిన ఎయిరిండియా విమానం
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. తాజా దృశ్యాలు
- టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు
- యుద్ధ పరిణామాలపై తాజా దృశ్యాలను విడుదల చేసిన మెహర్ న్యూస్ మీడియా సంస్థ
- ఇరాన్-ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా అంతటా మూతబడిన వైమానిక ప్రదేశాలు



దాడులు ఉధృతం చేసిన ఇరాన్.. ఇజ్రాయిల్‌లో సైరన్ల మోత
- ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ రాష్ట్ర భూభాగం వైపు క్షిపణులు ప్రయోగించబడినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF)గుర్తించాయి.
ప్రస్తుతం రక్షణ వ్యవస్థలు ఆ ముప్పును అడ్డుకోవడానికి పనిచేస్తున్నాయి. - గత కొన్ని నిమిషాల్లో, హోమ్ ఫ్రంట్ కమాండ్ సంబంధిత ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్లకు జాగ్రత్త సూచనను నేరుగా పంపింది.
ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ సూచనలను పాటించాలని కోరారు - హెచ్చరిక అందుకున్న వెంటనే, ప్రజలు రక్షిత స్థలంలోకి వెళ్లి, తదుపరి సూచనలు వచ్చే వరకు అక్కడే ఉండాలని ఆదేశాలు
- ఇరాన్ నుంచి ఇజ్రాయిల్ క్షిపణులు ప్రయోగించబడినట్లు గుర్తించిన తరువాత, ఆ దేశంలోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోత
పశ్చిమ ఇరాన్‌లో ఇజ్రాయిల్ విస్తృత దాడులు
పశ్చిమ ఇరాన్‌లోని ఇరానియన్ ప్రభుత్వానికి చెందిన అనేక సైనిక లక్ష్యాలపై విస్తృతమైన ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో రగులుతున్న పశ్చిమాసియా
- యూఎస్, ఇజ్రాయెల్ దాడ్లుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ మృతి
- ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
- ఒకేసారి 8 దేశాలపై మిస్సైళ్లు ప్రయోగించిన ఇరాన్
- సౌదీ, అబుదాబి సహా 8 దేశాలపై ఇరాన్ దాడులు
- పశ్చిమాసిమా ఘర్షణలతో వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం
ఇరాన్ పార్లమెంట్‌లో అమెరికా జెండా దహనం
- ఇరాన్ పార్లమెంటులో, ఎంపీలు అమెరికాకు మరణం అని నినాదాలు
- అమెరికన్ జెండా దహనం
- అమెరికన్ మాతృభూమిపై అణు బాంబును ప్రయోగిస్తామని ఎంపీలు బెదిరింపులు
In Iranian Parliament, MPs burn the American flag while chanting “Death to America,” and threaten to use a nuclear bomb against the American homeland.
pic.twitter.com/wcwAWUqxuU— Eyal Yakoby (@EYakoby) February 28, 2026
అబుదాబిలో భయానక వాతావరణం
- అబుదాబిలో భయానక వాతావరణం
- అబుదాబి వీధుల్లో భయకంపితులవుతున్న ప్రజలు
- అబుదాబిలో ఇరాన్ క్షిపణి దాడులు
అమెరికా నేవీ స్థావరాలే లక్ష్యంగా దాడులు
⚡️Panic in the streets of Abu Dhabi pic.twitter.com/zFhLBBsWGp
— War Monitor (@WarMonitors) February 28, 2026
ఏమాత్రం తగ్గని ఇరాన్..
- అమెరికా దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ సైతం అంతే తీవ్ర స్థాయిలో దాడులు
- ఈరోజు తెల్లవారుజామున బహ్రెయిన్‌లోని నావల్ సపోర్ట్ యాక్టివిటీ (NSA) వద్ద ఉన్న యూఎస్ నేవీ యొక్క 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలోకి దూసుకెళ్లిన ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి
Footage of an Iranian ballistic missile slamming into the headquarters of the US Navy's 5th Fleet at Naval Support Activity (NSA) Bahrain earlier today. pic.twitter.com/6omkCrLy2u
— OSINTtechnical (@Osinttechnical) February 28, 2026
అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు
- మిడిల్ ఈస్ట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి
- జోర్డాన్ , సౌదీ అరేబియా, కువైట్, బెహరైన్, ఖతార్, యూఏఈ లపై ఇరాన్ క్షిపని దాడులు
- బహరన్ లోని యూఎస్ నేవల్ బేస్ , సౌదీలోని అబుదాబిలో ఇరాన్ దాడులు క్షిపణి దాడులు
ఐ లవ్ ట్రంప్: ఇరాన్ విద్యార్థి
ఇరాన్‌లో ప్రస్తుత పాలనపై నిరసనలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరానియన్ హైస్కూల్ విద్యార్థులు కృతజ్ఞతలు
ఐ లవ్ ట్రంప్ అంటున్న ఓ ఇరాన్ స్టూడెంట్
Unbelievable 😂
Iranian high school students are THANKING president Trump for striking the regime in Iran.
“I love Trump!” One student says pic.twitter.com/Yazc638iU6— Throwback Iran (@Tarikh_Eran) February 28, 2026
అమెరికాపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి
బహ్రెయిన్‌లోని అమెరికా నావికా స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి
BREAKING:
Iranian ballistic missile struck US naval base in Bahrain. pic.twitter.com/Mv26a9XvaI— Current Report (@Currentreport1) February 28, 2026
ఆపరేషన్ రోరింగ్ లయన్.. ఐడీఎఫ్ కీలక ప్రకటన
ఇరాన్‌పై కొత్త ఆపరేషన్‌కు రోరింగ్ లయన్’(గర్జించే సింహం)గా ఇజ్రాయెల్ నామకరణం
ఐడీఎస్, యూఎస్ సాయుధ దళాలు ఇరాన్ ఉగ్రవాద పాలనను అంతం చేయడానికి భారీ చర్యలు ప్రారంభించాయి.
ఈ సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్‌పై దాడులు
గతంలో జరిగిన 'రైజింగ్ లయన్' ఆపరేషన్‌లో ఇరాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ..
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని గుప్త పద్ధతిలో బలోపేతం చేస్తూ, క్షిపణి ఉత్పత్తిని పునరుద్ధరిస్తున్నట్లు గుర్తించాం: ఐడీఎఫ్
ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనే తన ప్రణాళికను ఇరాన్ విరమించుకోలేదు.
ఇరాన్ తన అనుబంధ సంస్థలకు నిధులు, శిక్షణ ఆయుధాలను అందిస్తూ ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది.
ఇది ఇజ్రాయెల్‌కే కాకుండా మధ్యప్రాచ్యం, ప్రపంచం మొత్తానికి ప్రమాదకరం
ఈ దాడికి ముందు కొన్ని నెలల పాటు ఐడీఎఫ్, యూఎస్ మిలిటరీ మధ్య సమన్వయంతో ప్రణాళికా రచన
ఈ చివరి యుద్ధంలో పనిని పూర్తి చేసేది మనమే: రెజా పహ్లవి
ఇరాన్ ప్రజలను ఉద్దేశిస్తూ..
నా ప్రియమైన స్వదేశీయులారా..
ఒక నిర్ణయాత్మక క్షణం ముందుంది.
ఇరాన్ ధైర్యవంతులైన ప్రజలకు అమెరికా అధ్యక్షుడు వాగ్దానం చేసిన సహాయం ఇప్పుడు వచ్చింది.
ఇది మానవతావాద జోక్యం
ఇరాన్ గొప్ప దేశం
తుది విజయం ఇప్పటికీ మనదే.
ఈ చివరి యుద్ధంలో పనిని పూర్తి చేసేది మనమే,
ఇరానియన్ ప్రజలమే. వీధుల్లోకి తిరిగి రావడానికి సమయం ఆసన్నమైంది.
ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ కూలిపోతోంది కాబట్టి, సైన్యానికి ఇదే నా సందేశం
-ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు రెజా పహ్లవి
ఇరాన్‌లో ఉగ్రవాద పాలన యావత్ మానవాళికి ముప్పు: ఇజ్రాయిల్ ప్రధాని
- మన గొప్ప స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చారిత్రాత్మక నాయకత్వానికి కృతజ్ఞతలు
- 47 సంవత్సరాలుగా, ఆయతుల్లా పాలన ఇజ్రాయెల్‌కు మరణం
- అనేక మంది అమెరికన్లను హత్య చేసింది ఆయుతుల్లా పాలనలోని ఇరాన్. దాని సొంత ప్రజలను ఊచకోత కోసింది.
- ఈ హంతక ఉగ్రవాద పాలన మానవాళి మొత్తాన్ని బెదిరించేలా ఉంది.
- అణ్వాయుధాలు ధరించడానికి అనుమతించకూడదు.
- మన ఉమ్మడి చర్య ద్వారా ధైర్యవంతులైన ఇరానియన్ ప్రజలు తమ విధిని తమ చేతుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చాయి.
- ఇరానియన్ ప్రజలలోని అన్ని విభాగాలు - పర్షియన్లు, కుర్దులు, అజెరిలు, బలూచిలు మరియు అహ్వాజీలు - నిరంకుశత్వ కాడిని తొలగించి స్వేచ్ఛా ఇరాన్‌ను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇరాన్‌లోని భారత పౌరులకు అడ్వైజరీ జారీ
- భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న ఎంబసీ
- ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
- సయుక్తంగా దాడులు చేసిన అమెరికా, ఇజ్రాయెల్
- ఇరాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, యూఎస్
ఇజ్రాయెల్‌పై ఎదురుదాడి ప్రారంభించిన ఇరాన్
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడి ప్రారంభం
- బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ దాడి
- 35కు పైగా మిస్సైళ్లు ప్రయోగించిన ఇరాన్
- ఇజ్రాయెల్ రాజధానిపై విరుచుకుపడుతున్న ఇరాన్
- టెల్‌అవీవ్‌పై దాడులు చేస్తున్న ఇరాన్
- ఇజ్రాయెల్ రాజధానిపై విరుచుకుపడుతున్న ఇరాన్
చర్చలు ఫలించలేదు.. దాడులు తప్పలేదు: ట్రంప్
- అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడులు చేపట్టిందన్న ట్రంప్
- అమెరికాకు పొంది ఉన్న ప్రమాదాన్ని అరికట్డడానికే దాడులు
- ఇరాన్ అణ్వాయుధాలు మళ్లీ తయారు చేస్తోంది.
- అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండడం వల్లే దాడులు.
- USA ప్రజలకు పొంచిఉన్న ముప్పును ఎదుర్కొనేందుకే దాడులు.
- ఇరాన్ మద్ధతుతోనే హామాస్ ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది.
- ఇరాన్‌లో ఉన్న నరహంతక నాయకత్వాన్ని రూపుమాపుతాం
- ఇరాన్ నావికా దళాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాం
- ప్రపంచంలో ఉగ్రవాదానికి నెంబర్ వన్ మద్దతుదారు ఇరాన్
- ఆందోళనకు దిగిన సొంత ప్రజలనే ఇరాన్ చంపింది
- ఎన్నో ఎళ్లుగా ఇరాన్ ఉగ్రవాదానికి మద్ధతు ఇస్తోంది
- ఇరాన్‌ని అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకుంటాం
- B2 బాంబర్లు తమ పనిని సమర్థవంతంగా పూర్తిచేశాయి
- ఇరాన్‌పై దాడి ప్రపంచ శాంతికోసం చేపట్టాం
- ఇరాన్‌తో జరిగిన చర్చలు ఫలించలేదు
- ఇరాన్ నాయకులు సహకరించడం లేదు
- దీంతో బలప్రయోగం చేయక తప్పలేదు
- ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడం సహించం
- ఇరాన్‌తో పొంచి ఉన్న ముప్పును రూపుమాపడమే లక్షం
- 47 ఏళ్లుగా ఇరాన్ పాలకులు హింసను ప్రోత్సహిస్తున్నారు
ప్రతీకారం తీవ్రంగా ఉంటుందన్న ఇరాన్
- ఊహించని రీతిలో ముగింపు ఉంటుంది ఇరాన్
- యుద్ధం మీరు ప్రారంభించారు మేము ముగిస్తామన్న ఇరాన్
- ప్రతీకారం దారుణంగా ఉంటుదన్న ఇరాన్
- వేలాది మంది సైనికులు మరణించారని ప్రకటించిన ఇరాన్
ఇరాన్ సుప్రీం లీడర్ లక్షంగా దాడులు
- వేలాదిమంది సైనికులు మరణించారంటున్న ఇరాన్
- ఇరాన్ సుప్రీం లీడర్ లక్షంగా దాడులు
- దాడులకు ముందే బంకర్లోకి వెళ్లిన ఖమేనీ
- టెహ్రాన్ వదిలి వెళ్లిపోయిన ఖమేనీ
ప్రతిదాడికి సిద్ధమవుతున్న ఇరాన్
- లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ ఆపషన్
- టెహ్రాన్, ఇస్ఫోహాన్ నగరాలే టార్గెట్‌గా దాడులు
- ఇస్పహాన్‌లో భారీ పేలుళ్లు
ఖమేనీ కార్యాలయంపై దాడి
- 30 ప్రాంతాల్లో అమెరికా దాడులు
- అణుచర్చలపై సంతృప్తిగా లేనన్న ట్రంప్
- ప్రకటించిన కొద్ది సేపటికే దాడులు ప్రారంభం
- ఇరాన్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న అమెరికా, ఇజ్రాయెల్
- నార్త్ ఈస్ట్ టెహ్రాన్‌పై బాంబుల వర్షం
- తన మాటలను ఇరాన్ పట్టించుకోలేదన్న ట్రంప్
🚨 JUST IN!
Israel attacks Iran in preemptive strikes.
Defense Minister Israel Katz declares a special and immediate state of emergency across the entire country. pic.twitter.com/Szkc8MTdkG— The Iran Watcher 🇮🇷 (@TheIranWatcher) February 28, 2026
సైరన్‌లు మోగాయి తలదాచుకున్నాం
- ఇజ్రాయెల్‌లో సైరన్‌లో మోగాయని వీడియోలు
- సైరన్లు మోగాయని యుద్ధం ప్రారంభం అయిందని వీడియోలు
- ఇజ్రాయిల్ పరిస్థితులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ దేశ యువతి
⚠️ I’m in a bomb shelter in Israel right now. Sirens just rang across the country as an attack with Iran appears to be imminent. pic.twitter.com/XvF0b1c5BK
— Noa Tishby (@noatishby) February 28, 2026
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు.
- ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు.
- ఇరాన్‌పై క్షిపణుల దాడులు.
- ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు.
- దాడులను ధ్రువీకరించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి.
- ఇరాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ.
- ఇంటిలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి
సురక్షిత ప్రాంతానికి ఖమేనీ..
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడులకు దిగింది.
- ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది.
- ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు సమాచారం.
- బాంబు దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

ఎయిర్ స్పేస్‌ను మూసివేసిన ఇజ్రాయెల్
- ఇరాన్ కూడా ప్రతిదాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిక
- గతేడాది జూన్‌లో 12 రోజులు జరిగిన యుద్దం
- సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం
టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు
- ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్
- దాడులను అధికారికంగా ధృవీకరించిన ఇజ్రాయెల్
- రాజధాని టెహ్రాన్‌పై బాంబుల వర్షం
- ఇరాన్‌పై క్షిపణుల ప్రయోగం
- పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన ఇజ్రాయెల్
- ఇజ్రాయెల్ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు
#Israel attacks Iran - Reports say explosions were heard across Tehran, including in central districts, after Israeli forces launched strikes against Iranian targets early today. State of emergency declared in Israel amid threat of retaliation from Iran. pic.twitter.com/6oyJgMNlog
— TRISHUL (@TrishulxIN) February 28, 2026


