షాకిచ్చిన ఇరాన్.. హర్మూజ్ మళ్లీ క్లోజ్ | Iran israel war updates April 8th | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

షాకిచ్చిన ఇరాన్.. హర్మూజ్ మళ్లీ క్లోజ్

హర్మూజ్ ని మళ్లీ మూసివేసిన ఇరాన్

ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేవేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. 

2026-04-08 22:54:08

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు

  • లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు
  • 10 నిమిషాల్లో 100 వైమానిక దాడులు
  • వందల సంఖ్యలో మృతులు, క్షతగాత్రులు
  • లెబనాన్‌పై 1982 తర్వాత ఇజ్రాయెల్‌ అతిపెద్ద దాడి
2026-04-08 19:39:10

తక్షణమే ఇరాన్‌ను వీడండి: భారత విదేశాంగ శాఖ

  • అమెరికా-ఇరాన్‌ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ
  • తన పౌరులను అప్రమత్తం చేసిన భారత ప్రభుత్వం
  • తక్షణమే ఇరాన్‌ను వీడాలని ప్రకటించిన విదేశాంగ శాఖ
  • నిన్నటిదాకా బయటకు రావొద్దని.. సురక్షితంగా ఉండాలని సూచన
  • రెండు వారాల కాల్పుల విరమణ నేపథ్యంలో వెంటనే వీడాలంటూ తాజా ప్రకటన
  • పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్న కేంద్ర వర్గాలు
  • అవసరమైతే ఇరాన్‌లోని భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టే అవకాశం
2026-04-08 11:37:56

ఒప్పందానికి అంగీకరించినా దాడులు

  • కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా దాడులు? 
  • ఇరాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది: టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌ 
  • ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా పలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు 
2026-04-08 11:09:09

అంతా మంచే జరగొచ్చు: ట్రంప్‌

  • ట్రూత్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు
  • ఇరాన్ కూడా శాంతికోరుకుంటోంది
  • ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా శాంతిని కోరుకుంటున్నాయి
  • హర్ముజ్ జలసంధిలోని  ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి అమెరికా సహాయం చేస్తుంది
  • చాలా సానుకూల చర్యలు కనిపిస్తాయి.
  • ఇరాన్ తన పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చు.
  • మేము అన్ని రకాల సరఫరాలను పంపిస్తూ, అక్కడే ఉండి పరిస్థితులు సవ్యంగా సాగుతున్నాయో లేదో చూసుకుంటాం.
  • ఇక అంతా మంచే జరుగుతుందని నమ్మకం కనిపిస్తుంది
  • అమెరికాలోని పరిస్థితుల లాగానే పశ్చిమాసియాలో మంచి రోజులు రావచ్చు
2026-04-08 10:32:28

ఇది యుద్ధానికి ముగింపు కాదు: ఖమేనీ

  • ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన

  • ఇది యుద్ధానికి ముగింపు కాదు

  • మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి

  • సీజ్‌ఫైర్‌లో భాగంగా తక్షణమే కాల్పులు ఆపాలి

  • హార్మూజ్‌ను తెరిచేందుకు అంగీకరించాం

  • శత్రుదేశాలు దురాక్రమణకు పాల్పడితే దీటుగా సమాధానం

     

2026-04-08 08:32:10

హార్మూజ్‌ జలసంధి తెరవడానికి ఇరాన్‌ షరతులు

  • కాల్పుల విరమణ అమల్లో ఉండే 2 వారాలపాటు పరిమిత నౌకా రవాణాకు అనుమతి

  • మళ్లీ దాడులు జరిగితే తక్షణమే ఆపేస్తాం

  • ఈలోపు చర్చల కాలంలో ప్రతిదాడులను ఆపుతాం

  • నౌకలు సురక్షితంగా వెళ్లేలా చూస్తాం
    -ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి  

2026-04-08 08:05:47

ప్రతిపాదనలను అంగీకరించేలా చేశాం: ఇరాన్‌

  • మా యుద్ధ లక్ష్యాల్లో దాదాపు అన్నీ సాధించాం

  • అమెరికాపై మాది చారిత్రక విజయం

  • మా 10 పాయింట్ల ప్రతిపాదనలను అంగీకరించేలా చేశాం

  • శత్రువును శాశ్వత ఓటమి వైపునకు నెట్టాం

    -ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్

2026-04-08 08:01:31

కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరాన్‌, అమెరికా

కాల్పుల విరమణకు ఇరాన్‌, అమెరికా అంగీకరించింది. 14 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌ ప్రతిపాదనలు వర్కబుల్‌ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

2026-04-08 05:22:11

ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం: డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి అసీమ్‌ మనీర్‌తో జరిగిన చర్చల అనంతరం ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్‌ తన సొంత సోషల్‌మీడియా ట్రూత్‌లో పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం హోర్ముజ్ జలసంధిని పూర్తిగా, తక్షణమే తెరవడానికి అంగీకరిస్తే, రెండు వారాల పాటు దాడులను నిలిపివేయడానికి అమెరికా సిద్ధమైందని ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వైపాక్షిక కాల్పుల విరమణ (Ceasefire)కు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే అమెరికా తన సైనిక లక్ష్యాలను సాధించిందని, మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక శాంతి ఒప్పందం దిశగా చర్చలు చాలా ముందుకు వెళ్లాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ నుంచి 10 పాయింట్ల ప్రతిపాదన అందిందని, అది చర్చలకు సరైన పునాది అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య గతంలో ఉన్న విభేదాలపై చాలా అంశాల్లో ఇప్పటికే ఒప్పందం కుదిరిందని, మరో రెండు వారాల గడువు ఇస్తే పూర్తి ఒప్పందం ఖరారు అయ్యే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు ఈ చర్య కీలకమని పేర్కొన్న ట్రంప్, ఈ సమస్య త్వరలో పరిష్కారానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

2026-04-08 04:59:21

డెడ్‌లైన్‌పై ట్రంప్‌ యూటర్న్‌

పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనలకు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఇరాన్‌కు మరో రెండు వారాలపాటు డెడ్‌లైన్‌ పొడిగించిన ట్రంప్‌. పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఇరాన్‌కి ఇచ్చిన గడువుని మరో రెండు వారాలు పొడిగించాలని ట్రంప్‌ని కోరుతూ ట్వీట్ చేశారు. దానికి డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకారం తెలపడంతో ఇరాన్‌కి మరో రెండు వారాల గడువు పొడిగించిన ట్రంప్‌.

2026-04-08 04:19:25
Advertisement
 
Advertisement
Advertisement