Henley Passport Index 2023: Singapore Passport Holds The Top Spot, See Details Inside - Sakshi
Sakshi News home page

Henley Passport Index 2023: సింగపూర్‌ పాస్‌పోర్టు పవర్‌ఫుల్‌ ..!

Jul 20 2023 4:23 AM | Updated on Jul 20 2023 11:51 AM

Henley Passport Index 2023: Singapore passport holds the top spot - Sakshi

లండన్‌: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా సింగపూర్‌ నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. ఈ దేశం పాస్‌పోర్టు ఉంటే  ఎలాంటి వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించవచ్చు. ఇన్నాళ్లూ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంటూ వచ్చిన జపాన్‌ను తోసిరాజని సింగపూర్‌ మొదటి ర్యాంక్‌ దక్కించుకుంది. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ 2023 సంవత్సరానికి విడుదల చేసిన జాబితాలో సింగపూర్‌ తొలిస్థానంలో నిలిస్తే భారత్‌ 80వ ర్యాంక్‌ దక్కించుకుంది.

భారత్‌ వీసా ఉంటే ఇండోనేసియా, రువాండా, జమైకా, శ్రీలంక వంటి దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. కానీ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాలకు భారతీయులు వెళ్లాలంటే వీసా తీసుకొని తీరాలి. అమెరికా, చైనా, రష్యా, జపాన్‌ సహా పలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు వీసా తప్పకుండా తీసుకోవాలి.

వీసా లేకుండా పాస్‌ పోర్టు సాయంతో ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఐఏటీఏ) ఇచ్చే డేటా ఆధారంగా తొలిసారిగా ఈ జాబితా రూపొందించింది. జాబితాలో అమెరికాకు ఎనిమిదో స్థానం, యూకే నాలుగో ర్యాంకులో ఉంటే అట్టడుగు స్థానంలో అఫ్గానిస్తాన్‌ నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement