అసాధ్యురాలు.. ఏకంగా సింహం తోకపట్టుకుని

Harsh Goenka Shared A Video Of  ​His Daughter Brave Walk With The Lion  - Sakshi

సింహాలను టీవిల్లోని డిస్కవరీ ఛానల్‌లోనో లేక ఏదైన జూ పార్క్‌లలో చూసి ఉంటాం. కానీ దాన్ని సరాసరిగా చూడటానికే భయపడతాం. అలాంటిది ఒక అమ్మాయి సింహం తోక పట్టుకుని మరీ నడిచేస్తుంది. అసలు ఆమె ఎవరు, ఎక్కడ జరిగింది చూద్దాం రండి.

(చదవండి: మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!)

అసలు విషయంలోకెళ్లితే.....వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా కూతురు వసుంధర పత్నీ సింహg తోక పట్టుకుని నవ్వుతూ నడుస్తుంది.  అయితే ఆమె తండ్రి ఇండియన్ ఆర్‌పీజీ గ్రూప్ కాంగ్లోమెరిట్‌ ఛైర్మన్‌ అయిన హర్ష్‌ గోయెంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో తోపాటు" అది నా కూతురు. మీరు ఆమె తల్లిని ఊహించుకోగలరా " అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇది దక్షిణాఫ్రికా జాతీయ ఉద్యానవన పార్క్‌లోని వన్యప్రాణుల పర్యటనలోనిదని, అక్కడ నిపుణుల సమక్షంలో పెద్ద పులులతో ఎంజాయ్‌‍ చేస్తారు అంటూ రకరకాలు ట్వీట్‌ చేశారు.

(చదవండి: వృద్దుడు చేసిన వెరైటీ చాట్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top