Eight People Killed In Northern Mexico Nightclub - Sakshi
Sakshi News home page

మెక్సికోలో కాల్పులు.. 8 మంది మృతి

Jan 31 2023 6:20 AM | Updated on Jan 31 2023 9:50 AM

Eight people Kills in northern Mexico nightclub - Sakshi

మెక్సికో సిటీ: మెక్సికోలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జెరెజ్‌ టౌన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

దుండగులు పెద్ద సంఖ్యలో ఆయుధాలతో రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో నైట్‌క్లబ్‌కు చేరుకొని, అక్కడున్న జనంపై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని, ఆసుపత్రి చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారని పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో క్లబ్‌ ఉద్యోగులు, సంగీత కళాకారులు, వినియోగదారులు ఉన్నారని తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement