ఫేస్‌బుక్‌, ట్విటర్‌ రెడీనా.. ట్రంప్‌ వచ్చేస్తున్నాడు

Donald Trump Announced to Launch His Own Social Network - Sakshi

సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ని తీసుకురాన్ను ట్రంప్‌

ట్రూత్‌ సోషల్‌ పేరుతో ఎంట్రీ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం చోటు చేసుకున్న క్యాపిటల్‌ హిల్‌ హింసాత్మక ఘటనల కారణంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సోషల్‌ మీడియా నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లలో ట్రంప్‌ సోషల్‌ ఖాతాలను బ్యాన్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. తానే స్వయంగా ఓ సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ట్రూత్‌ సోషల్‌ పేరుతో ఈ ప్లాట్‌ఫామ్‌ని తీసుకురానున్నట్లు తెలిపారు. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌(టీఎంటీజీ) ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
(చదవండి: ట్విటర్‌ కోసం కోర్టుమెట్లెక్కిన డొనాల్డ్‌ ట్రంప్‌)

ఈ సందర్భంగా ట్రంప్‌ ‘‘త్వరలోనే నా ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ వేదికగా నా మొదటి వాస్తవాన్ని మీతో పంచుకోవడం కోసం నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. టీఎంటీజీ ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ మిషన్‌ని తీసుకువస్తోంది. ట్రూత్ సోషల్ పెద్ద కంపెనీల నిరంకుశత్వాన్ని నిరోధిస్తుంది. ప్రస్తుతం మనం ట్విటర్‌లో తాలిబాన్ల భారీ ఉనికిని కలిగి ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాము. ఇక్కడ మీ అభిమాన అమెరికా అధ్యక్షుడు మౌనంగా ఉన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు” అన్నారు. 
(చదవండి: కరోనా షాక్‌, ఫోర్బ్స్‌ రిచ్‌ లిస్ట్‌ నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ ఔట్‌)

ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫాం.. ఓ యాప్‌ ద్వారా యాపిల్‌ బెటా వెర్షన్‌గా నవంబర్‌లో "ఆహ్వానించబడిన అతిథులు" ద్వారా ట్రయల్ కోసం అందుబాటులో ఉంటుంది. 2022 మొదటి త్రైమాసికంలో కంపెనీ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.  టీఎంటీజీని పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీగా మార్చడానికి ట్రంప్ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్ బ్లాంక్ చెక్ కంపెనీ డిజిటల్ అక్విజిషన్ కార్ప్‌తో విలీనం అవుతుంది.
(చదవండి: సరికొత్త అవతారంలో ట్రంప్‌.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికన్లు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top