జోష్‌గా బర్త్‌ డే పార్టీ.. ప్రధానమంత్రికి భారీ జరిమానా | Corona Rules Break: Norway Prime Minister Fined | Sakshi
Sakshi News home page

జోష్‌గా బర్త్‌ డే పార్టీ.. ప్రధానమంత్రికి భారీ జరిమానా

Apr 9 2021 8:21 PM | Updated on Apr 9 2021 9:33 PM

Corona Rules Break: Norway Prime Minister Fined - Sakshi

జోష్‌గా బర్త్‌ డే పార్టీ.. నిబంధనలు ఉల్లంఘించడంతో ప్రధానమంత్రికే భారీగా జరిమానా

ఓస్లో: కరోనా మహమ్మారి భూగోళాన్నంతా చుట్టేస్తో మానవాళిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. అన్ని దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆదేశిస్తున్నా కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే నార్వే దేశంలో ఏకంగా ప్రధానమంత్రే కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. నిబంధనలు ఉల్లంఘించి తన జన్మదిన వేడుకను పర్వతప్రాంతంలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా నిర్వహించుకుంది. దీంతో ఆమెకు అక్కడి అధికారులు భారీగా జరిమానా విధించారు.

నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బర్గ్‌ ఇటీవల 60వ జన్మదిన వేడుక ఘనంగా చేసుకున్నారు. మొత్తం 13 మంది కుటుంబసభ్యులతో కలిసి ఆ పార్టీలో పాల్గొన్నారు. ఇది తీవ్ర దుమారం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి ఆమెకు జరిమానా విధించారు. ఎందుకంటే కరోనా సమయంలో ఏ కార్యక్రమమైనా పది మంది కన్నా ఎక్కువ మంది హాజరు కావొద్దు. కానీ ప్రధాని ఎర్నా నిబంధనలు ఉల్లంఘించి తన కుటుంబసభ్యులు 13 మంది పాల్గొన్నారు. ఇది గమనించిన అధికారులు ఆమెకు తాజాగా నార్వే కరెన్సీలో రూ.20 వేలు జరిమానా విధించారు. అది మన కరెన్సీలో దాదాపు రూ.1.75 లక్షలుగా ఉంది.జర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement