నాటో, ఈయూ సమాచారం కోసం .. చైనా లింక్డిన్‌ వల ? | China Creates Fake LinkedIn Accounts Targeting NATO And The EU Officials, More Details Inside | Sakshi
Sakshi News home page

నాటో, ఈయూ సమాచారం కోసం .. చైనా లింక్డిన్‌ వల ?

Mar 27 2026 11:49 PM | Updated on Mar 28 2026 1:37 PM

China Creates Fake LinkedIn Accounts Targeting NATO and the EU

యూరోపియన్ భద్రతా వర్గాలు సంచలన విషయాలు వెల్లడించాయి. నకిలీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లను ఉపయోగించి నాటో (NATO)  ఐరోపా సమాఖ్య (EU) సంస్థల నుండి రహస్య సమాచారాన్ని సేకరించడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించాయి.

నకిలీ లింక్డిన్‌ ఖాతాల ద్వారా సైనిక కూటమి (నాటో) లేదా ఐరోపా సమాఖ్య (EU) సంస్థలకు చెందిన డజన్ల కొద్దీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుందని భద్రతా వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో రిక్రూట్ చేసుకున్నవారిని చిన్నపాటి నివేదికలు రాయాలని కోరుతూ కొంత మొత్తం నగదు చెల్లిస్తారని వారిపై నమ్మకం కుదిరిన తర్వాత క్రమంగా బహిరంగంగా లభ్యం కాని సమాచారం లేదా అత్యంత రహస్యమైన డేటా కోసం ఒత్తిడి చేస్తారని పేర్కొన్నాయి.

ఇందులో ప్రధానంగా  "కెవిన్ జాంగ్" అనే పేరుతో ఉన్న ఒక అకౌంట్  ద్వారా ఈ కుట్ర సాగినట్లు ఈయూ అధికారులు గుర్తించారు. ఇతను హాంకాంగ్‌కు చెందిన "ఓరియంటల్ కన్సల్టింగ్" అనే నకిలీ సంస్థ అధిపతిగా చెలామణి అయినట్లు పేర్కొన్నారు. చైనా నిఘా వర్గాలు అత్యంత చాకచక్యంగా ఈ నెట్‌వర్క్ నిర్వహిస్తున్నారని దీని వెనుక ప్రధానంగా చైనా 'స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ' ఉన్నట్లు  ఆరోపిస్తున్నారు.  

కాగా  బ్రిటన్ గూఢచారి సంస్థ MI5 కూడా గతంలో ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement