వైద్యశాస్త్రంలో వింత: ఓ యువతికి కుడి వైపున గుండె

Chicago Teenage Girl Have Heart On Right Side - Sakshi

Right Side Heart Girl: గుండె ఎటు వైపు ఉందని చిన్నపిల్లాడిని అడిగిన ఎడమ వైపు.. లేదా లెఫ్ట్‌ సైడ్‌ అని సమాధానం ఇస్తారు. అయితే ఇప్పుడు ఆ సమాధానం మారేలా ఉంది. ఎందుకంటే ఓ యువతికి ఎడమ వైపున కాకుండా కుడి వైపు గుండె ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయమైనా ఇది వాస్తవం. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఈ విషయం తెలియడంతో ఆ యువతి షాక్‌కు గురయ్యింది. ఆమె చేసుకున్న పరీక్షల్లో గుండె కుడి వైపున ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

అమెరికాలోని చికాగో నగరానికి చెందిన 19 ఏళ్ల యువతి క్లారీ మక్‌ విపరీతమైన దగ్గుతో బాధపడుతోంది. రెండు నెలల నుంచి దగ్గు వస్తుండడంతో పరీక్షించుకోవాలని ఆస్పత్రికి వెళ్లింది. రాత్రిపూట విధులు నిర్వహిస్తుండడంతో జలుబు, దగ్గు సాధారణంగా భావించినట్లు క్లారీ తెలిపింది. జూన్‌లో ఆస్పత్రికి వెళ్లి మందులు వేయించుకున్నా తగ్గలేదు. ఎంతకీ దగ్గు తగ్గకపోవడంతో ఊపిరితిత్తుల సమస్య ఉండవచ్చని వైద్యులు  భావించారు. తదుపరి వైద్యం కోసం ఎక్స్‌ రే చేయించుకోవాలని చెప్పారు. ఎక్స్‌ రే చేసుకున్న అనంతరం రిపోర్ట్‌ను పరిశీలించిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. 

వైద్యులు వచ్చి ‘నీకు గుండె కుడి వైపున ఉంది’ అని చెప్పడంతో తాను గందరగోళానికి గురయ్యానని.. షాక్‌లో ఉన్నట్లు క్లెయిర్‌ మక్‌ తెలిపారు. నాకేమన్నా అవుతుందని వైద్యులను అడిగితే ఎలాంటి సమస్య లేదని వైద్యులు చెప్పినట్లు తెలిపింది. గుండె కుడి వైపు ఉండడాన్ని వైద్య పరిభాషలో ‘డెక్స్‌ట్రోకార్డియా’ అని అంటారు. ఈ వివరాలన్నీ క్లెయిర్‌ మక్‌ టిక్‌టాక్‌లో ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. ఆమె వీడియోను లక్షల్లో చూశారు. 4,33,00 మంది కామెంట్లు చేశారు. దేవుడి దయతో బాగున్నానని ఆ వీడియోలో తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top