Baby Born With Long Tail: అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు

The Baby Born In Brazil Had A long Tail With A Ball Shapped Mass At The Tip  - Sakshi

బ్రైజిల్‌: మానవుడు కోతి నుంచి పుట్టాడని కొందరూ, చింపాజీ నుంచి అని మరికొందరూ చెబుతారు. ఏదిఏమైనా మొదట్లో మానవునికి తోకలు ఉండేవని ఆ తర్వాత క్రమక్రమంగా తోకలు లేవని చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు గానీ బ్రెజిల్‌లోని ఒక బాలుడు మాత్రం తోకతో జన్మించాడు.

(చదవండి: అసాధ్యురాలు.. ఏకంగా సింహం తోకపట్టుకుని)
పైగా ఆ తోక 12 సెం.మీ పొడవుతో చివర ఒక బంతి ఆకారం ఉంటుంది. నిజానికి మానవుని జనన సమయంలో నాలుగు నుంచి ఎనిమిది వారాల గర్భధారణలో మొదట పిండం తోకల రూపంలోనే పెరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా నెలలు నిండే కొద్ది అవయావలు ఏర్పడి పూర్తి మానవ శరీర రూపంలోకి మారిపోతుంది. కానీ అనూహ్యంగా ఇది పిండంతోపాటుగా ఈ తోక కూడా పెరిగింది.

అయితే ఫోర్టలేజాలోని ఆల్బర్ట్ సబిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో శిశువు జన్మించిన సమయంలో 'తోక' 12 సెం.మీ వరకు పెరిగి 4 సెం.మీ వ్యాసం కలిగిన బంతిని కలిగి ఉన్నట్లు మెడికల్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు డాక్టర్లు శస్త్ర చికిత్స ద్వారా ఆ శిశువుకు తోకను తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి అరుదైన కేసులు సుమారు 40 వరకు చూశామని చెప్పారు. ఈ అరుదైన మానవ తోకల గురించి సమగ్రంగా రేడియోలాజికల్‌ పద్ధతుల ద్వారా అధ్యయనం చేయల్సిన అవసరం ఉందని అన్నారు.

(చదవండి: వింత ఇల్లు.. ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top