ప్రపంచంలోనే బలమైన బాలిక

7 Years Girl From USA  Records As Strongest Girl In The World - Sakshi

అమెరికాలోని ఒట్టోవా నగరానికి చెందిన రోరి వ్యాన్‌ ఉల్‌ఫిట్‌కు సరిగ్గా ఏడేళ్లు. ఏకంగా 80 కిలోల బరువును తేలిగ్గా లేపుతుంది. ఇటీవల జరిగిన అమెరికా జాతీయ చాంపియన్‌ షిప్‌ అండర్‌ 11, అండర్‌ 13 వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొనడం ద్వారా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంతోపాటు 80 కిలోల బరువును ఎత్తే అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ పుటల్లోకి ఎక్కింది. ఆ పాప 61 కిలోల బరువుతో స్క్వాట్స్‌ (మోకాళ్ల మీద కూర్చొని లేవడం) చేయగలదు. 

రోరి వ్యాన్‌ తన ఐదవ ఏటనే జిమ్నాస్టిక్స్‌ నేర్చుకోవడానికి క్లాస్‌లకు వెళ్లింది. ఓ పక్క జిమ్నాస్టిక్స్‌ నేర్చుకుంటూనే మరో పక్క వెయిటిలిఫ్టింగ్‌ ప్రాక్టీస్‌ చేసింది. ఇప్పటికీ ఆ పాప వారానికి తొమ్మిది గంటలపాటు జిమ్నాస్టిక్స్, నాలుగు గంటలపాటు వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తోంది. ఈ రెండు క్రీడల ప్రాక్టీస్, పోటీల సందర్భంగా పాపకు ఎలాంటి గాయాలు కాకుండా కోచ్‌లతోపాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top