14 ఏళ్ల టీనేజర్‌కి నగర బహిష్కరణ... మూడేళ్ల వరకు ప్రవేశం లేదు

14 Year Old Teenager From UK Banned Whole Town Goes Viral - Sakshi

ఇదివరకు పూర్వం గ్రామంలో ఎవరైన దారుణమైన పనులు చేస్తే గ్రామపెద్దలు గ్రామ బహిష్కరణ వంటి శిక్షలు వేసేవారు. అదీకూడా అలాంటి పనులు మరెవరు చేయకూడదని అలాంటి శిక్షలు విధించేవారు. రాను రాను అవి కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉండటమే కాకుండా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కనుమరుగైపోయాయి. ఇంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ స్మార్ట్‌ యుగంలో కూడా నగర బహిష్కరణలు ఉన్నాయంటే నమ్ముతారా!. ఔను నిజం ఒక దేశంలోని  టీనేజర్‌ని ఒక నగరం మొత్తం బహిష్కరించింది. ఎందుకు బహిష్కిరించారు ఏం జరిగిందనే కదా.

వివరాల్లోకెళ్తే....యూకే చెందిన 14 ఏళ్ల  కీలాన్ ఎవాన్స్‌ని  ఒక పట్టణం మొత్తం బహిష్కరించింది. కీలాన్‌ యూకేలోని వెస్ట్ మెర్సియా అనే పట్టణంలో నివశిస్తున్నాడు. ఐతే అతను ఆ పట్టణంలోని వ్యాపారులను, స్థానికులను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. ఆన్‌లైన్‌లో కూడా చాలా మందిని పలు రకాలుగా వేధించాడు. దీంతో ఆ టీనేజర్‌పై చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెస్ట్ మెర్సియా పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అదుపులోకి తీసుకుని అరెస్టు కూడా చేశారు.

అంతేకాదు యూకేలోని కోర్టు అతని క్రిమినల్‌ బిహేవియర్‌ కారణంగా అతను పట్టణంలో ఉండకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. అతను 2025 వరకు కూడా పట్టణంలోకి ప్రవేశించకూడదని చెప్పింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తుల సముహంలో కూడా ఉండకూడదని కూడా పేర్కొంది. ఎప్పుడైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమాన ఎదుర్కొవలసి ఉంటుందని వెల్లడించింది. ఈ శిక్షలు అతను భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పనులు చేయకుండ ఉండేందుకేనని కోర్టు స్పష్టం చేసింది. ఐతే యూకేలో యువకులపై ఇలాంటి శిక్షలు చాలా అసాధారణం. కానీ కీలాన్‌ దారుణమైన ప్రవర్తన కారణంగానే యూకే ఇలాంటి శిక్షలు విధించింది.

(చదవండి: రైల్వే ఫ్లాట్‌ ఫారం పై పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువకులు: ఫోటో వైరల్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top