ఖతార్‌లో భారీ పేలుడు: 12 మంది భారతీయులు మృతి | 12 Indians Killed In Qatar Gas Plant Explosion Says Embassy | Sakshi
Sakshi News home page

ఖతార్‌లో భారీ పేలుడు: 12 మంది భారతీయులు మృతి

Jun 22 2026 11:15 PM | Updated on Jun 23 2026 12:48 PM

12 Indians Killed In Qatar Gas Plant Explosion Says Embassy

ఖతార్‌ గ్యాస్‌ పోర్టులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు సోమవారం రాత్రి ప్రకటించారు. మృతుల్లో 12 మందిని భారతీయులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. 

ఆదివారం రాత్రి ఖతార్‌లోని రాస్ లఫాన్ ఎల్‌ఎన్‌జీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు జరిగింది. ఖతార్ అధికారులు సోమవారం మృతుల వివరాలను ధ్రువీకరించారని అక్కడి భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో తెలిపింది.

"రాస్ లఫాన్ ఘటనలో నిన్న రాత్రి 12 మంది భారతీయులు దురదృష్టవశాత్తు మరణించినట్టు ఖతార్ అధికారులు ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం" అని రాయబార కార్యాలయం ప్రకటనలో తెలిపింది.

కాగా, మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారని ఖతార్ ఇంధన మంత్రి సాద్ అల్-కాబీ కూడా సోమవారం మీడియాకు చెప్పారు. గాయపడ్డవారికి వైద్య చికిత్స అందుతోందని, వారిలో ఎవరి ప్రాణాలకూ ప్రమాదం లేదని సాద్ అల్-కాబీ తెలిపారు. మార్చిలో ఖతార్‌పై ఇరాన్ దాడి తర్వాత నిలిపివేసిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందని, 66 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement