నకిలీ పత్రాలతో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ ?
సాక్షి, సిటీబ్యూరో: దేశం మొత్తం ఒకే పన్ను వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చింది. ఆన్‌లైన్ పద్ధతిలో వస్తు సేవా పన్ను రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం వ్యాపారులకు కల్పించారు. అయితే ఈ ఆన్‌లైన్ ప్రక్రియను కొంత మంది అక్రమార్కులు యథేచ్చగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్ రిజి స్ట్రేషన్‌లోని లొసుగులకు ఆసరాగా చేసుకొని తప్పుడు సమాచారం ఆప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ సులువుగా పొందుతాన్నట్లు తెలుస్తోంది. అధికారులు పరిశీలనలో వేల సంఖ్యలో తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్స్ వెలుగులోకి వస్తున్నాయని ఓ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. ఇలాంటి వాటిని గమనించిన వెంటనే సంబంధిత అధికారులు తొలగిస్తున్నారు.అయితే బూటకపు రిజిస్ట్రేషన్లను గుర్తించడం.. వాటిని పరిశీలించడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. తప్పుడు చిరునామాలతో లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ అవుతున్నా వాణిజ్య పన్ను శాఖ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జీఎస్టీ పొర్టల్ కేంద్రం ఆధీనంలో ఉంది. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్న సమాచారం సరైనదా? కాదా? అని తెలుసుకునే వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ సమస్య నెలకొంది.
ఫేక్ ఆధార్ నంబర్, పాన్ నంబర్లతో రిజిస్ట్రేషన్లు


