రెండేళ్ల మనవరాలిపై తాతయ్య లైంగిక దాడి
నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
కాచిగూడ: మైనర్ బాలికై న మనుమరాలుపై లైంగిక దాడికి పాల్పడిన సర్ధార్ త్రిలోక్ సింగ్‌కు నాంపల్లి 12వ అదనపు సెషన్స్ జడ్జి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారని కాచిగూడ ఇన్‌స్పెక్టర్ టి.జ్యోత్స్న తెలిపారు. ఇన్‌స్పెక్టర్ తెలిపిన మేరకు..ఓ మహిళ తన భర్త మరణించడంతో రెండేళ్ల కుమార్తెతో కలిసి అత్త మహేందర్ కౌర్ కుటుంబంతో తిలక్‌నగర్‌లో నివాసముండేది. అయితే మే 2024లో అమె మరో ఇంట్లోకి మారింది. అప్పుడప్పుడూ తన రెండు సంవత్సరాల కుమార్తెను వారి ఇంటి వద్ద వదిలి వెళ్ళేది. 16 జూన్ 2024న తన కూతురు అన్యమనస్కంగా ఉండటంతో వైద్యులను సంప్రదించగా లైంగిక దాడిజరిగిందని నిర్ధారించారు. మామ సర్దార్ త్రిలోఖ్ సింగ్‌ను అనుమానించి అతనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నాంపల్లి 12వ అదనపు సెషన్స్ జడ్జి బుధవారం నిందితుడు సర్దార్ త్రిలోక్ సింగ్‌ను దోషిగా నిర్ధారించారు. కోర్టు అతనికి 25 సంత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ10వేల జరిమానా విధించిందని పోలీసులు తెలిపారు. నిందితుడు జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల సాధారణ శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు.


