ఎముకలూ వివరాలు చెబుతాయి! | - | Sakshi
Sakshi News home page

ఎముకలూ వివరాలు చెబుతాయి!

Jul 18 2025 1:33 PM | Updated on Jul 18 2025 1:33 PM

ఎముకలూ వివరాలు చెబుతాయి!

ఎముకలూ వివరాలు చెబుతాయి!

సాక్షి, సిటీబ్యూరో: మొన్న డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంగణంలోని పాత భవనం వాటర్‌ ట్యాంక్‌లో... నిన్న ముర్గీ చౌక్‌లోని పాడుబడిన ఇంట్లో... ఇలా నగరంలో తరచూ అస్థిపంజరాలు లభిస్తూనే ఉంటాయి. ఫోరెన్సిక్‌ నిపుణుల సాయంతో వీటిని అధ్యయనం చేసే పోలీసులు మృతుల లింగ నిర్ధారణ చేస్తుంటారు. అదెలా సాధ్యమనే అనుమానం అనేక మందిలో ఉంటుంది. అస్థిపంజరాలన్నీ సామాన్యుల కంటికి ఒకేలా కనిపిస్తాయి. అయితే వీటిని ఫోరెన్సిక్‌ కోణంలో అధ్యయనం చేసి అనేక వివరాలు తెలుసుకుంటారు. దీన్నే సాంకేతిక పరిభాషలో ఫోరెన్సిక్‌ ఆస్టియాలజీ అంటారు. ఈ శాస్త్రం ఆధారంగా అస్థిపంజరాల లింగం, వయస్సు తదితరాలను గుర్తిస్తుంటారు.

లింగ నిర్ధారణ చేసేది ఇలా...

ఎక్కడైనా గుర్తుతెలియని అిస్థిపంజరం దొరికినప్పుడు అది పురుషుడిదా? సీ్త్రదా? అనేది నిర్ధారించడంలో పెల్విక్‌ బోన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. తొడ ఎముకలు, వెన్నుముకను కలుపుతూ ఉండే ప్రాంతంలో గుండ్రంగా ఉండే దాన్నే పెల్విక్‌ బోన్‌ అంటారు. ఇది సీ్త్రలకు వెడల్పుగా, పురుషులకు కుంచించుకుని ఉంటుంది. దీని వల్లే తొడ ఎముక యాంగిల్‌ (వంపు) నిర్మాణంలోనూ తేడాలు వస్తాయి. పురుషుల తొడ ఎముక యాంగిల్‌ తక్కువగా, సీ్త్రలకు ఎక్కువగా నిర్మాణమై ఉంటాయి. లింగ నిర్ధారణకు ఇది ప్రాథమికమైన అంశం. పుర్రె సైతం దీని గుర్తింపునకు పనికి వస్తుంది. పుర్రె సీ్త్రలకు చిన్నదిగా, పురుషులకు పెద్దదిగా ఉంటుంది. ఫీమర్‌ బోన్‌గా పిలిచే తొడ ఎముకను బట్టి గుర్తించవచ్చు. సాధారణంగా సీ్త్రల తొడ ఎముక సున్నితంగా ఉంటుంది. పురుషుల ఎముకకు కండ పట్టి రఫ్‌గా తయారవుతుంది. దైనందిన జీవితంలో చేసే పనుల్లో ఉన్న వ్యత్యాసం కారణంగానే ఇలా ఉంటాయి.

వయస్సు గుర్తించేది ఇలా...

ఆ అస్థిపంజరం ఏ వయస్సు వారిదో నిర్థారించడానికి పుర్రె చాలా కీలమైంది. శిశువు గర్భంలో ఉండగా పుర్రె ఏడు భాగాలుగా ఉంటుంది. ప్రసవం సమయానికి అవి అతుక్కుని ఒకటిగా మారతాయి. ఈ అతుకులనే సూచర్స్‌ అంటారు. వయస్సు పెరిగే కొద్దీ ఈ అతుకులు కనుమరుగవుతుంటాయి. అందుకే పసి వాళ్ల తలపై నడినెత్తి భాగం చాలా మెత్తగా ఉంటుంది. కొన్ని నెలలకు అది పూడి గట్టిగా తయారవుతుంది. సూచర్స్‌ ఉన్న స్థితిని బట్టి వయస్సు నిర్ధారిస్తారు. పుర్రెలో ఉన్న పళ్లు కూడా వయస్సు నిర్ధారించడానికి ఉపకరిస్తాయి. దీన్ని ఫోరెన్సిక్‌ ఒడెంటాలజీ అంటారు. /్ఞానదంతం రాకపోతే 18 ఏళ్ల లోపుగా అంచనా వేస్తారు. మిగిలిన పళ్ల తీరు తెన్నులు, ఎముకల నిర్మాణం, వాటి పటుత్వం, ఎత్తు కూడా అస్థిపంజరం ఏ వయస్సు వారిదో గుర్తించడానికి ఉపకరిస్తాయి.

నగరంలో తరచూ లభిస్తున్న అస్థిపంజరాలు

వాటి నిర్మాణం ఆధారంగా మృతుల లింగ నిర్ధారణ

ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకునే నిపుణులు

ఫోరెన్సిక్‌ భాషలో ఆస్టియాలజీగా ప్రాచుర్యం

నిర్ధారణ మాత్రం డీఎన్‌ఏ ద్వారానే...

అస్థిపంజరం లభించకుండా కేవలం కొన్ని ఎముకలే దొరికి, అవి కూడా పూర్తి స్థాయిలో లేకపోతే గుర్తింపు కొద్దిగా ఇబ్బందే. అప్పుడు ఉన్న అవశేషాలను ఫోరెన్సిక్‌ లాబ్‌కు పంపడం ద్వారా డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహింస్తారు. ఈ పరీక్షల్లోనే లింగం, వయస్సు తదితర వివరాలు బయపడతాయి. లభించిన అస్తిపంజరం ఎవరిదనేది గుర్తించి, అధికారికంగా ఖరారు చేయాలన్నా డీఎన్‌ఏ పరీక్షలు తప్పనిసరి. అనుమానితులుగా ఉన్న సంబంధీకుల నుంచి రక్తనమూనాల తీసుకోవడం లేదా వారి మెడికల్‌ రికార్డుల ఆధారంగా ఈ పరీక్షలు చేస్తారు. అలా పోలీసులు తమకు లభించిన పుర్రెలు, ఎముకలకు డీఎన్‌ఏ టెస్ట్‌కు పంపించి అవి ఎవరివో ఓ అవగాహనకు వస్తారు. కేసుల దర్యాప్తు, అనుమానితులు, నిందితుల గుర్తింపులో ఈ విధానాలన్నీ ఎంతో కీలమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement