
కూడళ్ల సుందరీకరణ
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ సుందరీకరణ చేపట్టామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం గన్‌పార్క్ జంక్షన్, బీఆర్‌కే భవన్ దగ్గర సుందరీకరణను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్ సురేఖలతో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ గన్ పార్క్ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా డిజిటల్ మెకానిజంతో కూడిన అత్యాధునిక డైనమిక్ వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశామని చెప్పారు. బీఆర్‌కే భవన్ కూడలిని రకరకాల ఆకారాలతో ప్రజలకు విజ్ఞానం, అహ్లాదకరమైన వాతారణం, సంతోషాన్ని కలిగించే విధంగా తీర్చిదిద్దామన్నారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లను సైతం రానున్న రోజుల్లో అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ సుందరంగా తీర్చి దిద్దుతామన్నారు. – లక్డీకాపూల్