
రోడ్ సేఫ్టీపై స్పెషల్ డ్రైవ్
● రాత్రింబవళ్లు కొనసాగుతున్న పనులు
16 వేల పాట్‌హోల్స్‌కు మరమ్మతులు
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవలి వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై జీహెచ్‌ఎంసీ సీరియస్‌గా దృష్టిసారించింది. రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకుని రాత్రింబవళ్లు మరమ్మతు పనులు ముమ్మరంగా చేస్తోంది. వర్షాలు తెరిపినివ్వడంతో పగలూ రేయీ పనులు చేస్తున్నట్లు, మిషన్‌మోడ్‌లో పనులు జరుగుతున్నాయని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు 18 వేలకు పైగా పాట్‌హోల్స్ గుర్తించగా, ఇప్పటి వరకు దాదాపు 16 వేల పాట్‌హోల్స్ పనులు పూర్తయినట్లు చీఫ్ ఇంజినీర్ రత్నాకర్ సహదేవ్ (మెయింటనెన్స్) తెలిపారు. నగర ప్రజల ప్రయాణం సాఫీగా సాగేందుకు, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ఉండేందుకు రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పగలూ రేయీ పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలకనుగుణంగా, తిరిగి వర్షాలు రాకముందే వందశాతం పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాట్‌హోల్స్ పూడ్చివేతల పనులతోపాటు క్యాచ్‌పిట్స్ రిపేర్‌లు, దెబ్బతిన్న మూతల మార్పిడి, సెంట్రల్ మీడియన్ల మరమ్మతులు సైతం జరిగేలా చీఫ్ ఇంజినీర్ వరకు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 805 క్యాచ్ పిట్స్ రిపేర్‌లు, 388 మూతల మార్పిడితో పాటు పలు ప్రాంతాల్లో సెంట్రల్ మీడియన్ పనులు కూడా జరిగినట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు.
జోన్ల వారీగా వివరాలు..
ఎల్‌బీనగర్ జోన్‌లో 3042 పాట్‌హోల్స్, చార్మినార్ జోన్‌లో 2415, ఖైరతాబాద్ జోన్‌లో 24539, శేరిలింగంపల్లి జోన్‌లో 1763, కూకట్‌పల్లి జోన్‌లో 2508,సికింద్రాబాద్ జోన్‌లో పాట్‌హోల్స్ మరమ్మతులు పూర్తయినట్లు కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ప్రజలకు ఇళ్ల నుంచి పని ప్రదేశాలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా , ట్రాఫిక్ జామ్‌లు కాకుండా రోడ్ల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.