
‘మహా’ వర్షపాతం
ఈ సీజన్‌లో 31 శాతం అధికం
● గ్రేటర్‌లో ఇప్పటివరకు 61 సెం.మీ.
● ఆగస్టులోనే ఎక్కువ వర్షాలు
సాక్షి, సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వానలే వానలు. కుండపోత వర్షాలు కురియడంతో ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే అధికంగా 31.3 శాతం వర్షపాతం నమోదైంది. ముందస్తు వర్షాలు ప్రారంభమైనప్పటికీ మొదటి రెండు నెలలు వెనుకపట్టు పట్టాయి.
సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదు కాగా, గత నెలలో వానలు ఊపందుకున్నాయి. మహానగరం పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 1 వరకు సాధారణంగా 407.7 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాలి. అయితే 617.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా అమీర్‌పేట్, ఖైరతాబాద్‌లలో 56 శాతం, శేరిలింగంపల్లిలో 54 శాతం నమోదైంది. అయితే తిరుమలగిరి మండలంలో మాత్రం సాధారణం కంటే 0.7 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో మాత్రం 20 నుంచి 40 శాతానికిపైగా అత్యధికంగా వర్షం కురిసింది. మొత్తం మీద 90 రోజుల్లో సగటున 35 రోజులు వర్షాలు పడ్టాయి
రెవెన్యూ జిల్లాల వారీగా పరిశీలిస్తే..
● హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు సాధారణంగా 477.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురువాల్సి ఉండగా 622.2 మిల్లీమీటర్లు నమోదైంది. సగటున 32 శాతం అధికంగా కురిసింది.
● రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం 400.6 మిల్లీమీటర్లకుగాను 612.6 మిల్లిమీటర్లు కురిసింది. సగటున 53శాతం అత్యధికంగా నమోదైంది.
● మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో సాధారణ వర్షపాతం 454.3 మిల్లీమీటర్లు నమోదు కావల్సి ఉండగా, 592.7 మిల్లీమీటర్లు కురిసింది. సగటున సాధారణం కంటే 30 శాతం అధికంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఈ వర్షాకాల సీజన్‌లో సాధారణం కంటే అత్యధికంగా నమోదు ఇలా..
అర్బన్ మండలం సాధారణ వర్షపాతం కురిసిన వర్షపాతం శాతం
(మిల్లీమీటర్లలో..) (మిల్ల్లీమీటర్లలో..)
అమీర్‌పేట 489.6 762.3 56
ఖైరాతాబాద్ 481.6 760.1 56
శేరిలింగంపల్లి 490.4 755.9 54
ముషీరాబాద్ 471.0 677.9 44
బండ్లగూడ 457.7 648.6 42
షేక్‌పేట 472.2 659.7 40
మేడిపల్లి 478.5 662.8 39
కూకట్‌పల్లి 508.8 699.9 38
సరూర్‌నగర్ 441.2 607.9 36
రాజేంద్రనగర్ 466.6 632.3 36
కుత్బుల్లాపుర్ 487.8 596.5 36
సికింద్రాబాద్ 475.8 638.6 34
కాప్రా 411.6 544.8 32
అంబర్‌పేట 460.0 602.4 31
ఉప్పల్ 467.3 596.6 28