
రహదారి భద్రతపై ఆర్టీఏ పాఠాలు
సాక్షి, సిటీబ్యూరో: రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని హైదరాబాద్ ఉపరవాణా కమిషనర్ ఆఫ్రిన్ సిద్ధిఖి సూచించారు. గురువారం నాంపల్లిలోని మల్లేపల్లి ఐటీఐ కళాశాలలో ఆర్టీఏ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సును ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ప్రారంభించారు. రాష్ డ్రైవింగ్ ప్రమాదకరమని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల వాళ్లు ప్రమాదానికి గురికావడమే కాకుండా ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని చెప్పారు. విద్యాసంస్థల్లో రహదారి భద్రతా క్లబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్ధులకు అవగాహన పెంపొందించాలని ఆమె కోరారు. ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి పురుషోత్తమ్‌రెడ్డి రహదారి భద్రతపై పాఠాలు బోధించారు. కార్యక్రమంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ గంటా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
హిమాయత్ సాగర్ జలమండలి పార్కులో వన మహోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారులోని హిమాయత్ సాగర్ జలమండలి పార్క్‌లో గురువారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ మొక్కలు నాటారు. అంతకుముందు గ్రీన్ హౌస్‌ను ప్రారంభించిన ఎండీ.. అక్కడి మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఈఎన్సీ డైరెక్టర్ ఆపరేషన్–2 వీఎల్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్లు సుదర్శన్, టీవీ శ్రీధర్, ఆపరేషన్ డైరెక్టర్–1 అమరేందర్‌రెడ్డి, పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఫైనాన్స్ డైరెక్టర్ పద్మావతి, సీజీఎం బ్రిజేష్, ఈఓ విజయకుమారి, జలమండలి డీసీఎఫ్ వెంకటేశ్వర్లు, ఆర్.ఎఫ్.ఓ నారాయణరావు పాల్గొన్నారు.

రహదారి భద్రతపై ఆర్టీఏ పాఠాలు