గడువులోగా లక్ష్యం చేరుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

గడువులోగా లక్ష్యం చేరుకోవాలి..

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

గడువులోగా లక్ష్యం చేరుకోవాలి..

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: వరంగల్‌ జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి శాఖలకు కేటాయించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అటవీశాఖాధికారి నిఖితతో కలిసి జిల్లాస్థాయి మానిటరింగ్‌ అండ్‌ కో–ఆర్డినేషన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా శాఖల వారీగా మొక్కలు నాటడం, లక్ష్యాల సాధన, జియో ట్యాగింగ్‌ పురోగతి, మొక్కల పరిరక్షణ చర్యలపై సమగ్రంగా చర్చించారు. జిల్లాకు ఈ ఏడాది ఇప్పటి వరకు 7,27,612 మొక్కలు నాటినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, వై.వీ.గణేశ్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ నాగపద్మజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అవయవదానంపై అవగాహన

జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోన్‌రెడ్డి మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు ఉపేందర్‌రెడ్డి, భారతి, నిర్మల, శ్రీనివాస్‌, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement