రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ
కార్యదర్శి డాక్టర్ టి.కె.శ్రీదేవి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న యూజీడీ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో బల్దియా కార్యాలయం నుంచి కమిషనర్ టి.వెంకన్న, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టు, అర్బ న్ చాలెంజ్ ఫండ్, పట్టణాభివృద్ధి పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈఈలు రవికుమార్, సంజయ్‌కుమార్, డీఈ కార్తీక్‌రెడ్డి ఉన్నారు.
ప్రతిపాదనలు రూపొందించండి..
బోనాలు, బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ వెంకన్న ఆదేశించారు. సోమవారం బ ల్దియా కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టెండర్ సకాలంలో పూర్తి చేసి పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


