ఆక్రమణలపైనే అధిక ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపైనే అధిక ఫిర్యాదులు

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

ఆక్రమణలపైనే అధిక ఫిర్యాదులు

వరంగల్‌ అర్బన్‌: అనధికారిక భవన నిర్మాణాలపై బల్దియా గ్రీవెన్స్‌ సెల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అధికారుల ఎదుట అర్జీదారులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ టి.వెంకన్న పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి 39 అర్జీలు రాగా, అందులో వ్యక్తిగత ఫి ర్యాదులు అధికంగా ఉండడం గమనార్హం. మౌలిక వసతుల కల్పన కోసం ఇంజనీరింగ్‌ సెక్షన్‌కు 31 పరిశుభ్రత కోసం హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌కు 11, కొత్త ఇంటి నంబర్లు, పేరు మార్పిడి వివిధ సమస్యలపై రెవెన్యూకు 9, తాగునీటి సరఫరా సమస్యలు, అదనపు నల్లాల తొలగింపు కోసం 8 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, బయాలజిస్ట్‌ మాధవరెడ్డి, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, ఇన్‌చార్జ్‌ సీపీ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, అనిల్‌బాబు, రామకృష్ణ, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం తదితరులున్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● మడికొండ 64వ డివిజన్‌ వెస్ట్‌ సిటీలో తాగునీటి పైప్‌లైన్‌ నిర్మించాలని వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

● 55వ డివిజన్‌ గోపాల్‌పూర్‌ అరుణోదయ కాలనీలో ఐదేళ్ల కిందట అమృత్‌ తాగునీటి పైప్‌లైన్లు వేశారని, నీరు సరిగ్గా రావట్లేదని, సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని వేర్వేరుగా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు విన్నవించారు.

టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి

వెల్లువెత్తిన వినతులు

గ్రేటర్‌ గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన కమిషనర్‌ వెంకన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement