ఫార్మసీ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలి
టీజీపీఓఏ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్
ఎంజీఎం: రాష్ట్రంలోని ఫార్మసీ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీఓఏ) రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సంఘం నాయకులతో కలిసి మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బత్తిని సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ 104 ఎఫ్‌డీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న ఫార్మసీ ఆఫీసర్స్‌కు 10 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సూచించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల శరత్‌బాబు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జాలి గామ అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు ఉదయ్‌ప్రసాద్, పద్మజ, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ శ్రీహరి, ఆనంద్ కుమార్, నాయకులు కల్యాణ్, రాధిక, అలేఖ్య, అర్చన ఉన్నారు.


