విద్యుత్ పనులు 10లోపు పూర్తి చేయాలి
హన్మకొండ : మేడారం జాతర విద్యుత్ సరఫరా పనులను ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ములు గు ఎస్‌ఈ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ జాతరను దృష్టిలో ఉంచుకుని నార్లాపూర్‌లో కొత్తగా నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేసి ఈ నెల 16న చార్జ్ చేయాలన్నారు. అలాగే, గట్టమ్మ ఆలయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న 33/ 11 కేవీ సబ్ స్టేషన్ పనులు ఈ నెల 20 వరకు పూర్తి చేసి వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మేడారంలోని పార్కింగ్ స్థలా ల్లో పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు వివిధ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లు 170 వరకు ఏర్పాటు చేశామన్నారు. అవసరం మేరకు బిగించాల్సిన ట్రాన్స్‌ఫార్మర్ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ప్రాజెక్టస్) వి.మోహన్ రావు, డైరెక్టర్ (ఆపరేషన్) టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ కె.రాజు చౌహాన్, ములుగు ఎస్‌ఈ ఎ.ఆనందం, డి.ఈ.లు పి.నాగేశ్వర రావు, రాజు, సదానందం, ఈఈ (సివిల్) వెంకట్ రామ్, ఏడీఈలు రాజేశ్, వేణుగోపాల్, సందీప్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
16న నార్లాపూర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ చార్జ్ చేయాలి
పార్కింగ్ స్థలాల్లో విద్యుత్ పనులు
త్వరగా పూర్తి చేయాలి
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి


