విద్యుత్ అధికారుల ప్రజాబాట..
హన్మకొండ : విద్యుత్ అధికారులు ప్రజా బాట పట్టారు. మంగళవారం టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సెక్షన్లలో క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు పరిష్కరించారు. హనుమకొండలోని శ్రీనివాస కాలనీలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ నక్కలగుట్ట సెక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజాబాటలో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస్ కాలనీ, భవానీ నగర్‌లో కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే కొన్ని పరిష్కరించారు. సమయం తీసుకునే చేసే పనులను నిర్దేశించిన సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వినియోగదారుల వద్దకు నేరుగా వెళ్లి వారి విద్యుత్ సమస్యలను తెలుసుకుని పరిష్కరించే కార్యక్రమమే ‘ప్రజాబాట’ అన్నారు. అధికారులు నేరుగా ప్రజల వద్దకెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాబాట లక్ష్యమన్నారు. స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) టి.మధుసూదన్, సీజీ ఎం కె.రాజు చౌహాన్, హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి, డీఈ టెక్నికల్ ఎ.విజేందర్ రెడ్డి, డీఈ కన్‌స్ట్రక్షన్ దర్శన్ కు మార్, ఏ.డి.ఈ ఇంద్రసేనారెడ్డి, ఏఈ ప్రవీ ణ్, బీజేపీ జిల్లా కార్యదర్శి గుజ్జుల మహేందర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
క్షేత్ర స్థాయిలో పర్యటించి
సమస్యలు తెలుసుకున్న ఆఫీసర్లు
విద్యుత్ అధికారుల ప్రజాబాట..


