నల్లా నీటిని సరఫరా చేయాలి
లక్ష్మీపురం కాలనీవాసుల డిమాండ్
వరంగల్ అర్బన్: నల్లా నీటిని సరఫరా చేయాలని గ్రేటర్ 26వ డివిజన్ లక్ష్మీపురం కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా నల్లా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్‌మెంట్‌వాసులు నల్లాలకు మోటార్లు పెట్టడం, పైపులైన్ల లీకేజీలతో నీళ్లు రావడం లేదని వర్క్ ఇన్‌స్పెక్టర్లు సమాధానమిచ్చినట్లు మహిళలు పేర్కొన్నారు. కాలనీవాసులు సుజాత, పద్మావతి, భాగ్య, విజయ, కన్నయ్య, సుహసిని, కల్యాణి, రమాదేవి, వసంత తదితరులు పాల్గొన్నారు.


