తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు కాలనీల్లోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు సహకరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. 56వ డివిజన్ సురేంద్రపురి కాలనీలో తడి, పొడి చెత్తపై మంగళవారం ఆమె అవగాహహన కల్పించి మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేవిధంగా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. కార్పొరేటర్ సిరంగి సునీల్‌కుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, డీఈ రవికిరణ్, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్, టీపీఎస్ సతీశ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాషానాయక్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.


