మహిళలకు అక్షరజ్ఞానం అవసరం
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: పొదుపు సంఘాల మహిళలకు అక్షరజ్ఞానం అవసరమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించిన అమ్మకు అక్షర మాల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. శిక్షణ పొందిన సీఆర్పీలు నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పుస్తకాన్ని మేయర్ ఆవిష్కరించారు. హనుమకొండ మెప్మా పీడీ జోనా, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, జిల్లా వయోజన విద్య కోఆర్డినేటర్ రమేశ్‌రెడ్డి, డీఎంసీ రజితారాణి, టీఎంసీ వెంకట్‌రెడ్డి, సీఓలు పాల్గొన్నారు.
వెహికిల్ షెడ్డు ఆకస్మిక తనిఖీ..
బాలసముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న వెహికిల్ షెడ్‌ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వెహికల్ షెడ్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని, ర్యాంపు మరమ్మతులు పూర్తిచేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఎస్‌ఈ సత్యనారాయణ, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు మహేందర్, మాధవీలత, డీఈలు రాజ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, సారంగం, సంతోష్ కుమార్, శానిటరీ సూపర్‌వైజర్లు నరేందర్, గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.


