వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలి
● అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, శాశ్వత క్రీడాపాఠశాల నిర్మాణానికి స్థలం గుర్తించి పనులు ప్రారంభించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చారిత్రక వరంగల్ జిల్లాను విద్యనేకాకుండా క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలం కోరగా సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం, రెసిడెన్షియల్ క్రీడాపాఠశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చి ఆరునెలలు గడిచాయని, వెంటనే స్పందించి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం, శాశ్వత క్రీడా పాఠశాల నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.
వీధికుక్క అడ్డు రావడంతో..
● బైక్ అదుపు తప్పి ఆర్టీసీ డ్రైవర్ మృతి
గీసుకొండ: వీధికుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం వద్ద చోటు చేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన గూడ సంతోష్(40) హనుమకొండ ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వ్యక్తి గత పని నిమిత్తం బైక్‌పై నగరానికి వచ్చిన సంతోష్.. సాయంత్రం 4.30 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ధర్మారం రంగనాయకుల కుంట వద్దకు చేరుకోగానే వీధి కుక్కలు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో పెయింటర్ మృతి
రామన్నపేట: వరంగల్ పోతననగర్‌లో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని సోమవారం పెయింటర్ బజారు సునీల్ (40) మృతి చెందాడు. ఈ ఘటనలో అతడితో పాటు పనిచేస్తున్న శ్రీరాములు తులసీదాస్ గాయపడ్డాడు. ఇద్దరూ భోజనం అనంతరం తిరిగి పనికి వెళ్తుండగా.. వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్ వారిని ఢీకొట్టింది. క్షతగాత్రులను ఎంజీఎం తరలించగా, సునీల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య బజారు అనిత ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ జక్కుల సమ్మయ్యపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.
వ్యాపారిపై వేధింపులు
రామన్నపేట: పాత వ్యాపార లావాదేవీల పేరుతో తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ వరంగల్ మట్టెవాడకు చెందిన వ్యాపారి గుండ గౌతమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి కథనం ప్ర కారం.. 2016లో ముగిసిన అపార్ట్‌మెంట్ లెక్కల వి షయంలో లకుం సురేందర్ ఇప్పుడు రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారు. అక్టోబర్ 7న షాపులోకి వచ్చి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చే సుకుంటానని వాట్సాప్‌లో బెదిరిస్తున్నారని గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులకు ప్రాణభయం ఉందని, నింది తుడిపై కఠిన చ ర్యలు తీసుకో వాలని ఆయన కోరుతున్నారు.
వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలి


