ల్యాండ్ సర్వేయర్స్ నూతన కార్యవర్గం
గీసుకొండ: లైసెన్స్‌డ్ ల్యాండ్ సర్వేయర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సోమవారం సంఘం కార్యాలయంలో జిల్లా సర్వేయర్ల సమావేశం జరిగింది. అనంతరం అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ గోనె విజయ్‌రెడ్డి, బర్ల పూర్ణచందర్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవునూరి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రంగు శివ, ఉపాధ్యక్షుడిగా జినికిరి రాజ్‌కుమార్, జనరల్ సెక్రటరీగా గజవెల్లి ప్రదీప్, వరంగల్ డివిజన్ కోఆర్డినేటర్‌గా మామిడాల సాయిరామ్, సెక్రటరీలుగా బొమ్మెర రఘు, మరుపట్ల ఏకాంబరం, కోశాధికారిగా ధర్మసోత్ కిరణ్, గౌరవ సలహాదారులుగా ఆవునూరి శివకుమార్, మహిళా కోఆర్డినేటర్‌గా బలుగురి దీపిక, నర్సంపేట డివిజన్ కో ఆర్డినేటర్‌గా పెంతల విష్ణుతో పాటు 13 మండలాల కోఆర్డినేటర్లను ఎన్నుకున్నారు. సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అధ్యక్షుడు రాజు తెలిపారు.


