‘టెట్’కు సర్వం సిద్ధం
హనుమకొండ జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలు
విద్యారణ్యపురి: ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న టెట్ పరీక్షకు హనుమకొండ జిల్లాలో అధికారులు ఏడు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఆయాన్ డిజిటల్ జోన్ వడ్డేపల్లి, అయాన్ డిజిటల్ ఎర్రగట్టుగుట్ట, భీమారంలోని మోక్షిత కంప్యూటర్స్, హసన్‌పర్తి బిసైడ్‌్ హైవే ప్రాంతంలోని నోబుల్ టెక్నాలజీ సొల్యూషన్స్, కాజీపేట సోమిడిలోని తాళ్లపద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ, ములుగు రోడ్డులోని గాయత్రి డిగ్రీ కళాశాల, హసన్‌పర్తిలోని భీమారం ప్రాంతంలోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఉన్నాయి. ప్రతీ రోజు మొదటి సెషన్, రెండో సెషన్‌లో టెట్ ఉంటుంది.
పరీక్ష రాయనున్న 19,699 మంది..
అన్ని పరీక్ష కేంద్రాలు కలిపి 19,699 మంది అభ్యర్థులు రాయనున్నారు. ఈ టెట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటలనుంచి ఉదయం 11:30 గంటల వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఏడు పరీక్ష కేంద్రాలకు 10 మంది అబ్జర్వర్లను హెచ్‌ఎంలను నియమించారు. రెండు టీంలు ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను నియమించారు. ఒక్కో టీంలో ఇద్దరు చొప్పున హెడ్మాస్టర్లు ఉన్నారు. టెట్ నిర్వహణలో హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్‌గా డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ వ్యవహరిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలో అబ్జర్వర్లతో, ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందంతో సమావేశం నిర్వహించి టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కాగా, టెట్ పరీక్షను కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా రాస్తున్నారు.


