8,9వ తేదీల్లో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 8, 9వ తేదీల్లో ఓపెన్ టు ఆల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ సమీపంలో తిరుమల తిరుపతి ఆలయ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంస పత్రాలు, వ్యక్తిగత పతకాలు, ట్రోఫీలను బహూకరించనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పేర్లు నమోదు, ఇతర వివరాలకు 9059522986 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
23న మోషన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్
● మోషన్ ఐఐటీ, నీట్ కాలేజ్ చైర్మన్
వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్
హన్మకొండ: మోషన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్‌లో ప్రతిభ కనబరిచిన పది మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు మోషన్ ఐఐటీ నీట్ కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. మంగళవారం హనుమకొండ నయీంనగర్‌లోని మోషన్ ఐఐటీ, నీట్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఐటీ, నీట్ కోచింగ్‌కు దేశంలోనే అగ్రగామి విద్య సంస్థ అయిన రాజస్థాన్ కోటా మోషన్ ఐఐటీ, నీట్ కాలేజీ ఆధ్వర్యంలో ఈ నెల 23న దేశవ్యాప్తంగా మోషన్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్‌కు అర్హులని తెలిపారు. టాలెంట్ టెస్ట్ రిజిస్ట్రేషన్ కోసం 9703000850, 9703000851 సెల్ నంబర్లలో గాని, హనుమకొండ నయీంనగర్‌లోని మోషన్ ఐఐటీ, నీట్ ఇన్‌స్టిట్యూట్‌లో సంప్రదించాలని సూచించారు.
కేయూలో ఎంట్రీకి వాహనాలకు క్యూఆర్ కోడ్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఆవరణలోకి బయటినుంచి వచ్చే వాహనాలను నియంత్రించేందుకు సిబ్బంది వాహనాలకు క్యూఆర్ స్టిక్కర్లు ఇవ్వనున్నారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థులు, పరిశోధకులు తమ సంబంఽఽధించిన ఆర్‌సీ, ఐడీ కార్డు జిరాక్స్, పాస్‌ఫొటోను పరిపాలన భవనంలోని నాన్ టీచింగ్ స్టాఫ్ కార్యాలయంలో అందించి క్యూఆర్ కోడ్ స్టికర్స్ పొందాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం మంగళవారం సర్క్యులర్ జారీచేశారు. కేయూ మొదటి గేట్, రెండో గేట్ వద్ద సెక్యూరిటీ గార్డులు ఈ క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్‌ను చూసి ఇకనుంచి ఆయా వాహనదారులను ఆపకుండా యూనివర్సిటీలోకి అనుమతిస్తారు. యూనివర్సిటీలో వాస్తవంగా పని నిమిత్తం వచ్చేవారి వాహనాలకు స్టిక్కర్స్ లేకున్నా కూడా అనుమతిస్తారు. అనవసరంగా వచ్చే వారిని నిలువరించేందుకు ఈ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ విధానాన్ని తీసుకొచ్చామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
బతికి ఉన్న మహిళకు డెత్ సర్టిఫికెట్..?
● లేబర్‌కార్డు ఇన్సూరెన్స్ డబ్బులు స్వాహా
వరంగల్: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ కొత్తపేట గ్రామానికి చెందిన ఓ మహిళ బతికి ఉన్నప్పటికి డెత్ సర్టిఫికెట్ సృష్టించి లేబర్‌కార్డు ఇన్సూరెన్స్ డబ్బులు స్వాహా చేసినట్లు తెలిసింది. ఈవిషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిఘా వర్గాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. నగరంలోని ఒక మీ సేవా నిర్వాహకుడితోపాటు సదరు మహిళ బంధువులు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం జరిగి సుమారు 8నెలలు అయినట్లు తెలిసింది. కై ్లమ్ డబ్బుల వాటాల్లో తేడాలు వచ్చి విషయం బయటకు పొక్కినట్లుగా ప్రచారం సాగుతోంది. నిఘా వర్గాలు రంగంలోకి దిగినందున పూర్తి విషయాలు వెలుగులోకి రానున్నాయి.


