పిడుగుపాటుతో రైతు మృతి
●పోచారంలో ఘటన
పరకాల : పిడుగుపాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఓ ఎద్దు కూడా మృత్యువాత పడింది. ఈ ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోస మహిపాల్ (45)తన చేను వద్ద పనిచేస్తుండగా వర్షం మొదలైంది. ఉరుములతో కూడిన వర్షంతో భయపడి తన ఎద్దులను బండికి కట్టేందుకు యత్నించే క్రమంలో పిడుగుపడింది. దీంతో మహిపాల్‌తోపాటు ఎద్దు మృతి చెందింది. కాగా, కొద్ది సేపట్లో ఇంటికి చేరుకోవాల్సి న మహిపాల్ విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు.


