
అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలు
పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల
ఆహ్వాన సంఘం ఎన్నిక
కేయూ క్యాంపస్: సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా, కామన్ విద్యావిధానం కోసం ఎంతోమంది ఉద్యమించి తమ ప్రాణాలు కోల్పోయారని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో జరగనున్న పీడీఎస్‌యూ మహాసభలను విజయవంతం చేసేందుకు కేయూ ఫార్మసీ కళాశాలలో కమలమ్మ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నాయన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా పోరాడాలన్నారు. పీడీఎస్‌యూ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కడారి భోగేశ్వర్, రిటైర్డ్ హెచ్‌ఎం రాంబ్రహ్మం, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేశ్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, ఎం.మహేశ్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, మంద నవీన్, ప్రణయ్‌కుమార్, కోశాధికారి రాణాప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దీపాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడిగా (హెచ్‌ఆర్‌ఎఫ్) జీవన్‌కుమార్, అధ్యక్షుడిగా కేయూ రిటైర్డ్ ఆచార్యులు కాత్యాయనీవిద్మహే, ప్రధాన కార్యదర్శిగా మెస శ్రీనివాస్, కోశాఽధికారిగా బొడపెల్లి అజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. మొత్తం 200 మంది సభ్యులతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్