
వరంగల్ మార్కెట్‌కు సెలవులు
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సెలువులు ఉన్నందున మార్కెట్‌లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని ఈవిషయాన్ని రైతులు, వ్యాపారులు, గుమస్తా, దడవాయి, కార్మికులు గమనించాలని మార్కెట్ కమిటీ కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18వ తేదీ (శనివారం)వారంతపు యార్డు బంద్, 19న (ఆదివారం)వారంతపు సెలవు, 20న(సోమవారం) దీపావళి పండుగ(ప్రభుత్వ సెలవు), 21న (మంగళవారం) అమావాస్య కావడంతో వరసగా మార్కెట్ బంద్ ఉంటుందని, బుధవారం 22వ తేదీన మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను సెలవు దినాల్లో మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు.
కేయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు(శనివారం) కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన ఎల్‌ఎల్‌బీ, బీటెక్, ఎంఎస్సీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎంటెక్, దూరవిద్య ఎంఎల్‌ఐఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. మిగితా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని విద్యార్థులు గమనించాలని తెలిపారు. పూర్తి వివరాలకోసం www.kakatiya.ac.inలో చూడాలని కోరారు.
మణికంఠ కాలనీలో చోరీ
వరంగల్: వరంగల్ 14వ డివిజన్ ఏనుమాముల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుందరయ్యనగర్ మణికంఠకాలనీలో శుక్రవారం మధ్యాహ్నం ఓ ఇంటిలో చోరీ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమాచారం తెలిసిన వెంటనే సీఐ సురేశ్, డాగ్ స్క్వాడ్‌తో వెళ్లి ఇంటిని పరిశీలించినట్లు తెలిసింది. ఈవిషయమై సీఐని వివరణ కోరగా బంగారం, నగదు దోచుకుపోయినట్లు నిర్ధారణ అయ్యిందని, ఇంటి యజమాని లేకపోవడంతో ఎంతపోయిందన్న వివరాలు తెలియలేదన్నారు. బాధితుడు రాత్రి 7 గంటల వరకు ఫిర్యాదు చేయలేదు. తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్‌గా పెట్టుకున్నందున ఎవరైనా ఊరికి వెళితే సమాచారం అందించాలని సీఐ కోరారు.

వరంగల్ మార్కెట్‌కు సెలవులు