
ఎయిర్‌పోర్ట్‌తో పారిశ్రామికాభివృద్ధి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● భూసేకరణపై అధికారులతో సమీక్ష
న్యూశాయంపేట: వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ప్రజల ఆకాంక్ష అని, హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మామునూరు ఎయిర్‌పోర్ట్ ఎంతో ఉపయోగపడుతుందని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఎయిర్‌పోర్ట్ భూసేకరణ పనుల పురోగతిపై ల్యాండ్ ఆక్విజేషన్ రిటైర్డ్ ఓఎస్డీ మనోహర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎయిర్‌పోర్ట్ మేనేజర్ తులసి మహాలక్ష్మి, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు 220 ఎకరాల వ్యవసాయ భూమి సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఎయిర్‌పోర్ట్ స్థలంలోని చెరువులు కుంటలు, విద్యుత్ హైపోల్స్, సెల్‌టవర్లు, ఎత్తుగా ఉన్న భవనాలు, చెట్లను గుర్తించి నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులను సత్యశారద ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ, వరంగల్ ఇన్‌చార్జ్ ఆర్డీఓ విజయలక్ష్మి, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, ఆర్డీఓ కార్యాలయ డీఏఏ ఫణికుమార్, ఎస్‌ఈ ఇరిగేషన్ వరంగల్ హెచ్‌వీ.రాంప్రసాద్, మిషన్ భగీరథ డీఈ జీవన్, ఎన్పీడీసీఎల్ ఏడీఈ చంద్రమౌళి, లీగల్ మెట్రాలజీ శ్రీని వాస్‌రావు, డీఎఫ్‌ఓ సృజనకుమారి, సర్వేయర్ రజిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి
న్యూశాయంపేట: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి ఆదేశించారు. వరంగల్ డివిజన్‌లో ధాన్యం కొనుగోలుపై సన్నాహక, శిక్షణను హనుమకొండ డీసీసీబీ భవన్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.