
ప్రజల గొంతుకపై ఆంక్షలు సరికాదు
పత్రికా స్వేచ్ఛపై విషం చిమ్ముతున్న ఏపీ ప్రభుత్వం
వరంగల్/న్యూశాయంపేట: ప్రభుత్వాలు, ప్రజలకు వారధిగా ఉన్న పత్రికలపై ఆంక్షలు విధించడం సరికాదని పలువురు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై అనుసరిస్తున్న వైఖరి, ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు. ఈసందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన విషయాలపై కథనాలు రాసినా, ప్రచురించినా ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే వివరణ కోరాలే తప్ప కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అన్నారు. వరంగల్ ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జ్ గడ్డం రాజిరెడ్డి మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం హరిస్తోందని, ‘సాక్షి’ చీఫ్ ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెట్టిన కేసులను భేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘సాక్షి’ మీడియాపై అనుసరిస్తున్న దమననీతికి వ్యతిరేకంగా ప్రజా, ఉద్యోగ సంఘాలతో ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ వాంకే శ్రీనివాస్, జర్నలిస్టు సంఘాల నా యకులు నల్లాల బుచ్చిరెడ్డి, పొడిశెట్టి విష్ణువర్ధన్, కంకణాల సంతోశ్, సాయిరాం, బోల్ల అ మర్, అలువాల సదాశివుడు, కొల్ల కృష్ణకుమార్, అహ్మద్, రాధాకృష్ణ, డి.రమేశ్, జి.రమేశ్, ఎ.నరేందర్, వెంకట్, జాఫర్, నరేశ్, సునేందర్, రవి, అనిల్, సబ్ ఎడిటర్లు ఓంకార్, ఉమామహేశ్, బోనాల రమేశ్, బండి రాజు, రాంచందర్, డి.రాజు, అశోక్, మహ్మద్ సాజీత్, దాసరి బాబు, సంపెట శ్రవణ్, శివ, సంపెట వెంకటేశ్వర్లు, వీకే రమేశ్ పాల్గొన్నారు.
సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అత్యంత దారుణం. ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంటాయి. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను బయటపెడుతుంటాయి. ఇది సహించలేని ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం, కాలరాయడం తీవ్రంగా ఖండిస్తున్నా. సాక్షి మీడియాపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. సాక్షి పత్రిక, ఎడిటర్, సిబ్బందిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నా.
– తాటిపాముల వెంకట్రాములు,
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు
●
‘సాక్షి’ మీడియా, ఎడిటర్‌పై పెట్టిన
కేసులు ఎత్తివేయాలి
జర్నలిస్టులు, ప్రజాసంఘాల
నాయకుల డిమాండ్
వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా

ప్రజల గొంతుకపై ఆంక్షలు సరికాదు