
నేటి బంద్ ఆరంభం మాత్రమే
హన్మకొండ: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నేడు (శనివారం) తలపెట్టిన బంద్ ఆరంభం మాత్రమేనని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కే అంతిమ లక్ష్యం వరకు పోరాటం సాగుతుందన్నారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్‌కు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బీసీ ఉద్యమాన్ని అడ్డుకుంటే మరో తెలంగాణ ఉద్యమం అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓరుగల్లు వేదికగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానంతో, గాంధీ మార్గంలో బీసీల హక్కుల సాధనకు ఉద్యమిస్తామన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీఆర్‌ఎస్ లీగల్ సెల్ బాధ్యుడు తాళ్లపెల్లి జనార్దన్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, బీఆర్‌ఎస్ నాయకులు పులి రజినీకాంత్ ముది రాజ్, కుసుమ లక్ష్మీనారాయణ, నార్లగిరి రమేశ్, శోభ్, రఘు, నరెడ్ల శ్రీధర్, పెరికారి శ్రీధర్ రావు, పానుగంటి శ్రీధర్, మూటిక రాజు యాదవ్, సారిక, పోలపెల్లి రామ్మూర్తి, సుహాస్ పాల్గొన్నారు.
బీసీలకు రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం
బీసీలను మోసం చేసిన కాంగ్రెస్
శాసన మండలి ప్రతిపక్ష నేత
సిరికొండ మధుసూదనాచారి