
ఏసీబీ వలలో అవినీతి చేపలు
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ములుగు రోడ్ సమీపంలో గల వరంగల్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి చేపలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆఫీసుకు వచ్చిన మత్స్యకారుల్లో కలిసిపోయి అవినీతి చేపను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సినిమా సీన్‌ను తలపించే ఘటనతో మత్స్యశాఖ కార్యాలయ సిబ్బందికి అసలు ఏం జరుగుతుందో అర్ధంకాక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు మత్స్యశాఖ ఉద్యోగుల్లో ప్రకంపనలు లేపాయి. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాధన్నపేట గ్రామ మత్స్యసహకార సంఘంలో నూతన సభ్యులను చేర్చుకోవడం కోసం 2023లో అప్పుటి ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్, ప్రస్తుతం జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణికి సొసైటీ తరఫున దరఖాస్తు చేశారు. ఏడాది క్రితం సొసైటీ ప్రెసిడెంట్ తమ ఫైల్ అప్రూవల్ ఎప్పడు అవుతుందని ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్‌ను అడిగితే రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని డీఎఫ్‌ఓ నాగమణి దృష్టికి తీసుకెళ్లగా ఆమె సైతం హరీశ్ చెప్పిన మొత్తాన్ని ఇస్తేనే పని అవుతుందని చెప్పారు. రెండు సంవత్సరాలుగా మత్స్యశాఖ అధికారి చుట్టూ తిరిగిన మాధన్నపేట సొసైటీ ప్రెసిడెంట్, సభ్యులు విసిగిపోయారు. దీంతో హనుమకొండలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం మత్స్యశాఖ కార్యాలయానికి వచ్చి.. ప్రణాళిక ప్రకారం ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్‌కు సొసైటీ ప్రెసిడెంట్ రూ.50 వేలు, డైరెక్టర్ రూ.30 వేలు లంచం ఇస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హరీశ్‌ను విచారించగా తనకేమీ తెలియదని, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి తీసుకోమని చెబితేనే తీసుకున్నానని ఏసీ బీ అధికారుల ముందు చెప్పాడు. దీంతో ఫీల్డ్ ఆఫీ సర్ హరీష్, డీఎఫ్‌ఓ నాగమణి లను తదుపరి విచా రణ కోసం నేడు(శనివారం) ఏసీబీ కోర్టులో హాజ రుపరచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
సొసైటీ సభ్యత్వం కోసం
లంచం డిమాండ్
రూ.80 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ
ఫీల్డ్ ఆఫీసర్
వరంగల్ మత్స్యశాఖ ఆఫీసులో ఘటన

ఏసీబీ వలలో అవినీతి చేపలు