
రేస్‌వాక్‌లో రికార్డు బ్రేక్..
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న జాతీయస్థాయి 5వ అథ్లెటిక్స్ అండర్–23 చాంపియన్‌షిప్ పోటీల్లో అథ్లెట్లు శుక్రవారం అదే జోరు ప్రదర్శించారు. రెండో రోజు 30 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా 13 ఈవెంట్లలో ఫైనల్స్ పూర్తయ్యాయి. అథ్లెటిక్స్ పోటీల్లో 20వేల మీటర్ల పురుషుల రేస్‌వాక్‌లో ఆర్మీ విభాగానికి చెందిన సచిన్ బొహరా (1:26:59:83) నిమిషాలతో కొత్త రికార్డును సృష్టించాడు. 2022లో రాజస్తాన్‌కు చెందిన సంజయ్‌కుమార్ (1:27:14) నిమిషాల్లో చేరి విజేతగా నిలిచాడు. సరికొత్తగా ఆ రికార్డును బ్రేక్ చేయడం సంతోషంగా ఉందని సచిన్ తెలిపాడు. పోటీల ఏర్పాట్లను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, అధ్యక్షుడు స్టాన్‌లీజోన్స్, డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్ పర్యవేక్షించారు. పోటీల నిర్వహణలో టెక్నికల్ అఫిషి యల్స్, కోచ్‌లు వాసుదేవరావు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
పతకాలు సాధించిన క్రీడాకారులు..
మహిళల 20 వేల మీటర్ల రేస్‌వాక్‌లో మహిమాచౌదరి(రాజస్తాన్) గోల్డ్, ఆర్తి(హరియాణా) సిల్వర్, కోమల్‌పాల్(మధ్యప్రదేశ్) బ్రాంజ్ మెడల్ సాధించారు. పురుషుల 20 వేల మీటర్ల రేస్‌వాక్: సచిన్‌బోహ్రా(ఆర్మీ)గోల్డ్, రోషన్‌కుమార్(ఝార్ఖండ్) సిల్వర్, హిమాన్షుకుమార్(ఉత్తరాఖండ్) బ్రాంజ్, 100 మీటర్ల హార్డిల్స్ మహిళల విభాగం: ప్రంజాలిరాలిపాటి(మహారాష్ట్ర)గోల్డ్, అక్షిదాస్ (తమిళనాడు) సిల్వర్, శ్రీయారాజేష్(కర్ణాటక) బ్రాంజ్ మెడల్ కై వసం చేసుకున్నారు. డెకాథ్లాన్ పురుషుల విభాగం: కౌశల్‌కుమార్(మహారాష్ట్ర) గోల్డ్, అభిజిత్‌భోసలే(ఎయిర్‌ఫోర్స్) సిల్వర్, హరీశ్ ఎస్(తమిళనాడు) బ్రాంజ్ గెలుపొందారు. పురుషుల 1,500 మీటర్ల పరుగు: ప్రభుజోత్‌సింగ్(పంజాబ్) గోల్డ్, వికాష్(హరియా ణా) సిల్వర్, ఆకాశ్‌భాటి(ఉత్తరప్రదేశ్) బ్రాంజ్ మెడల్ సాధించారు. డిస్కస్‌త్రో పురుషుల విభాగం: ఉజ్జవల్(జేఎస్‌డబ్ల్యూ) గోల్డ్, నాగేంద్రఅన్నప్ప(కర్ణాటక)సిల్వర్, రితిక్(ఎన్‌సీఓఈ(పటియాల)బ్రాంజ్ మెడల్ సాధించారు. పురుషుల 400 మీటర్ల పరుగు : తరణదీప్‌సింగ్(పోలీస్‌స్పోర్ట్స్ కంట్రోల్) గోల్డ్, సేతుమిశ్రా(బిహార్)సిల్వర్, అంకుల్, ఎన్‌సీఓఈ(త్రివేండ్రం), బ్రాంజ్ పతకాలు సాధించారు. పోల్‌వాల్ట్ మహిళల విభాగం: కార్తీక వి( తమిళనాడు) గోల్డ్, నేఖ ఎల్దో ఎన్‌సీఓఈ(త్రివేండ్రం) సిల్వర్, విదువిజయ్‌కుమార్(తమిళనాడు) బ్రాంజ్ మెడల్ సాధించారు. 110 మీటర్ల హార్డిల్స్ పురుషుల విభాగం: క్రిషిక్ ఎం(ఐఏసీఎల్) గోల్డ్, రాహిల్‌సఖీర్(కేరళ) సిల్వర్, రతీష్‌దుహీషా(రిలయన్స్) బ్రాంజ్, లాంగ్‌జంప్ పురుషుల విభాగం: అనురాగ్ సీవీ(కేరళ)గోల్డ్, శారోన్‌దూస్(తమిళనాడు)సిల్వర్, ఆర్యన్‌చౌదరి (ఉత్తరప్రదేశ్) బ్రాంజ్, హైజంప్ పురుషుల విభాగం: శివ్‌భగవాన్(హరియాణా) గోల్డ్, సుదీప్(కర్ణాటక) సిల్వర్, ఎండీ అలీ(వెస్ట్‌బెంగాల్) బ్రాంజ్, షాట్‌పుట్ పురుషుల : అతుల్(రిలయన్స్) గోల్డ్, అనురాగ్‌సింగ్ (రైల్వేస్పోర్ట్స్) సిల్వర్, నిఖిలేశ్(హరియాణా) బ్రాంజ్, 400 మీటర్ల పరుగు మహిళల విభాగం: ఆయుష్(ఉత్తరప్రదేశ్) గోల్డ్, ప్రియ(కర్ణాటక) సిల్వర్, సండ్రామోల్‌సాబు ఎన్‌సీఓఈ(త్రివేండ్రం)బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
జేఎన్‌ఎస్‌లో రెండో రోజు అథ్లెట్ల సందడి
13 ఈవెంట్లలో పోటీలు పూర్తి

రేస్‌వాక్‌లో రికార్డు బ్రేక్..

రేస్‌వాక్‌లో రికార్డు బ్రేక్..

రేస్‌వాక్‌లో రికార్డు బ్రేక్..

రేస్‌వాక్‌లో రికార్డు బ్రేక్..