
బస్సు పోలీస్ స్టేషన్‌కు పోనివ్వండి
కురవి: ‘నా ఫోన్ పోయింది.. బస్సును పోలీస్ స్టేష న్‌కు పోనివ్వండి..’ అంటూ ఆర్టీసీ బస్సులో ఓ ప్ర యాణికుడు హల్‌చల్ చేశాడు. వివరాలిలా ఉన్నా యి.. శుక్రవారం ఓ యువకుడు ఖమ్మం వెళ్లేందుకు మానుకోట డిపో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేటికి అతని సెల్‌ఫోన్ పోయిందని బస్సులో వెతికాడు. ఫోన్ దొరక్కపోవడంతో కండక్టర్, డ్రైవర్‌తో ఫోన్ పోయిందని బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాలని వాదించాడు. డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లగా.. తన ఫోన్ పోయిందని.. చెక్ చేయాలని ప్రయాణికుడు పోలీసులను కోరాడు. చెక్ చేయడం కుదరదని, ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని తెలిపారు. కానీ, ప్రయాణికుడు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయాడు.
సెల్‌ఫోన్ పోయిందని ప్రయాణికుడి
హల్‌చల్
సముదాయించి పంపించిన పోలీసులు