
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
ఐనవోలు: ప్రేమించిన యువతి తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన యాకర ప్రమీల– బాబుల చిన్న కుమారుడు యాకర హరిబాబు(27) డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల హరిబాబు ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు హరిబాబును దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హరిబాబు ఈ నెల 12న రాంనగర్‌లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హరిబాబును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి మేనమామ కలకోట రత్నం ఫిర్యాదు మేరకు యువకుడు ప్రేమించిన అమ్మాయి, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ వెల్లడించారు.