
గమ్యంపై గురిపెడితే విజయం..
మామునూరు: ఏకాగ్రతతో గమ్యంపై గురిపెడితే విజయం సొంతమవుతుందని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అన్నారు. పోలీస్ అధికారులు తమ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్‌లు ఎంతో దోహదపడుతా యని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో తెలంగాణ పోలీస్ దేశంలోనే బెస్ట్ అని కొనియాడా రు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్‌లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రెండో తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్–20 25 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. తె లంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, అ డిషనల్ డీజీ మహేశ్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరై డ్యూటీ మీట్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో ని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన 450 మంది పైగా 18 టీమ్‌లు హాజరుకాగా.. పోలీసులు జెండాలు చేతబూని అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ నేర దర్యాప్తుతోపాటు అన్ని విభాగాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో నిలవడం హర్షణీయమన్నారు. 69వ ఆలిండియా డ్యూటీ మీట్‌లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం
అభినందనీయం..
ఇటీవల జరిగిన 68వ జాతీయ స్థాయి డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీసులు 18 పతకాలు సాధించడం అభినందనీయమని అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అన్నారు. జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని పథకాలు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. అంతకు ముందు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.. తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణను వివరించారు.
450 మందికిపైగా పోలీస్
అధికారులు, సిబ్బంది హాజరు..
వరంగల్ మామునూరు పీటీసీలో గురువారం నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు జరగనున్న పోలీస్ డ్యూటీ మీట్–2025 అట్టహాసంగా ప్రారంభమైంది. రా ష్ట్రంలోని ఏడు జోన్లతోపాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు, సీఐడీ, ఇంటెలిజె న్స్, యాంటీ నార్కొటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ వింగ్, జీ.ఆర్.పీ, ఐటీ అండ్ టీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు చెందిన సుమారు 450 మందికిపైగా పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సైంటిఫిక్ ఎయిడ్ ఇన్విస్టిగేషన్, యాంటీ సబటేజ్ చె క్, కంప్యూటర్ అవేర్‌నెస్, డాగ్ స్క్వాడ్ కాంపీటిష న్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించి 25 విభాగాల్లో పోటీలు ప్రారంభమయ్యా యి. సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, ఎస్పీ రాంరె డ్డి, డీసీపీలు అంకిత్‌కుమార్, సలీమా, రాజమహేంద్రనాయక్, పీటీసీ ప్రిన్సిపాల్ ఇ.పూజ, కమాండెంట్లు రాంప్రకాశ్, రామకృష్ణ, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
జెండాను ఆవిష్కరిస్తున్న అభిలాష్ బిస్త్
విధుల్లో తెలంగాణ
పోలీస్ దేశంలోనే బెస్ట్
వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్ దోహదం
69 ఆలిండియా డ్యూటీ మీట్‌లో
సత్తా చాటాలి
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్
అట్టహాసంగా పోలీస్ డ్యూటీ
మీట్–25 ప్రారంభం

గమ్యంపై గురిపెడితే విజయం..

గమ్యంపై గురిపెడితే విజయం..

గమ్యంపై గురిపెడితే విజయం..

గమ్యంపై గురిపెడితే విజయం..

గమ్యంపై గురిపెడితే విజయం..