
ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ చేపట్టాలి
రామన్నపేట : నగరంలోని ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ పక్కగా చేపట్టాలని కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. గురువారం హనుమకొండ ఏషియన్ షాపింగ్ మాల్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూంలను, 35వ డివిజన్ వరంగల్ పుప్పాలగుట్ట వాటర్ ట్యాంక్ వద్ద శానిటేషన్ అండర్ డక్ట్ ప్రాంతం, చింతల్ బ్రిడ్జి వద్ద గల ప్రజా మరుగుదొడ్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పుప్పాల గుట్ట ప్రాంతంలో పర్యటించి సిబ్బంది ఫే స్ అటెండెన్స్‌ను పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆమె మాట్లాడుతూ.. విధులు నిర్వహించే తీ రుతోపాటు ఒక్కపూట భోజనం సరిపోతుందా..? రెండు పూటల అందించాలా..? అని అడిగి తెలుసుకున్నారు. శివనగర్‌లో అసంపూర్తిగా ఉన్న డక్ట్‌ను పరిశీలించిన కమిషనర్ వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డీఈలు రాజ్‌కుమార్, రంగరావు పాల్గొన్నారు.
పరిశీలన..
నయీంనగర్: గ్రేటర్ పరిధిలోని ఉనికిచర్ల కుడా లే ఔట్ స్థలం, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్.. అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమెవెంట పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, ఏపీఓ రామ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్