
భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్ : భూ భారతి దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఆ వెంటనే దరఖాస్తుదారులకు నోటీసులు జారీ, విచారించి వాటి పరిష్కారానికి తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో భూభారతి దరఖాస్తులపై గురువారం అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్వోలతో కలిసి ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు పూర్తిచేసిన భూభారతి దరఖాస్తుల ప్రక్రియ, ఇంకా ఎన్ని చేయాల్సి ఉంది, దరఖాస్తుల పరిష్కారం ఎప్పటివరకు పూర్తవుతుందని తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని కేటాయించామని, దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు భూసేకరణ, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై కలెక్టర్ మాట్లాడారు. సమావేశంలో డీఆర్‌ఓ వై.వి. గణేష్, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్