
మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే..
హసన్‌పర్తి : ఎన్నికలు ఎప్పుడొచ్చిన కేసీఆరే ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. సోమవారం స్థానికంగా జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వేలన్నీ బీఆర్‌ఎస్ వైపే ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతలు సోషల్ మీడియా, యూత్ నాయకులు తమ భుజాలపై వేసుకోవాలని సూచించారు. బోగస్ సర్కార్ ఇచ్చిన బోగస్ హామీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వివరించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందని, అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, త్వరలోనే కమిటీలు వేసి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ బండి రజనీకుమార్, డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, అటికం రవీందర్, నాయకులు చంద్రమోహన్, భగవాన్‌రెడ్డి, శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు