
టీ–హబ్‌తో ఎంఓయూ కోసం చర్చలు
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని టీ–హాబ్‌తో కాకతీయ యూనివర్సిటీలోని కే–హబ్ ఎంఓయూ కోసం కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రూసానోడల్ ఆఫీసర్, కేయూ జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, కే–హబ్ డైరెక్టర్ సవితాజ్యోత్స్న సోమవారం టీ–హబ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీ–హబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తాలూక్ తదితరులతో సమావేశమై ఎంఓయూ కోసం చర్చలు జరిపారు. రెండో శ్రేణి నగరం వరంగల్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో స్టార్టప్‌ల స్థాపన, ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థలపై సమాలోచనలు జరిగాయి. టీ– హబ్‌లో అందుబాటులో ఉన్న ఆధునిక మౌలిక సదుపాయాలను పరిశీలించి ఆ వసతులను కే–హబ్‌లో ఎలా రూపొందించొచ్చు అనే అంశంపై విశ్లేషించారు. కే–హబ్ అభివృద్ధిలో టీ–హబ్ సీఈఓ కవికృత్ సహకారంతో ముందడుగు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కేయూ డిప్యూ టీ రిజిస్ట్రార్ మహ్మద్ హబీబ్, కే–హబ్ కోఆర్డినేటర్లు బొల్లం కిరణ, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.
ఆ కార్యాలయాన్ని సందర్శించిన వీసీ ప్రతాప్‌రెడ్డి