
ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్ చౌరస్తా: ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. వరంగల్ దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికలు, రిజిస్టర్లు, తరగతి గదులను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. విద్యా బోధనతీరును విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచేలలని ఆమె సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్ ఇక్బాల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
రైతులతో ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన గీసుకొండ మండల రైతులతో కలెక్టర్ సత్యశారద బుధవారం కలెక్టరేట్‌లో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. 20 మంది రైతులు అవార్డ్ పాస్ చేసేందుకు ఈ ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ రియాజుద్దీన్, నేషనల్ హైవే మేనేజర్, రైతులు, అధికారులు పాల్గొన్నారు.