
పోక్సో కేసులో నేరస్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష
వరంగల్ లీగల్ : బాలిక (8 సంవత్సరాలు)పై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నేరస్తుడు గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన పసునూరి ఐలయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ వరంగల్ పోక్సో కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రా సిక్యూటర్ జి.బృందాదేవి కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన బాలిక 2021, జూన్ 28న సాయంత్రం నీరు తీసుకురావడానికి గ్రామంలోని దుర్గమ్మ గుడి వద్ద గల వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న బాలికను అటుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన పసునూరి ఐలయ్య తన వెంట చెరువు వద్దకు తీసుకెళ్లాడు. దీనిని గ్రామస్తులతోపాటు బా లిక బంధువు గుగులోత్ రాజు చూసి తల్లికి చెప్పా డు. దీంతో తల్లి వెళ్లి చూడగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు తన కూతురు ఉంది. ఏం జరిగిందని అడగగా పసునూరి ఐలయ్య మీ అమ్మాయిని తీసుకుని వస్తుండటాన్ని తాము చూ శామని, కాసేపటికి అమ్మాయి కేకలు వి నిపించడంతో తాము పరిగెత్తుకుంటూ వ చ్చామన్నారు. ఐలయ్య తమను చూసి పారి పోయాడని చెప్పారు. అనంతరం బాధిత బాలిక తన పట్ల ఐలయ్య వ్యవహరించిన తీరును తల్లికి తెలిపింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో ఐపీసీ సెక్షన్ 376, 366 కింద ఐలయ్యకు పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా, బాలికపై లైంగిక దాడి (పోక్సో చట్టం) సెక్షన్ 5, ఆర్/డబ్ల్యూ 6 చట్టం కింద యావజ్జీవ కారాగార శిక్ష (జీవించినంత కాలం), రూ.20 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పులో పేర్కొన్నారు. బాధిత బాలికకు పరిహార చెల్లింపు పథకం కింద రూ.7 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జడ్జి తీర్పులో పేర్కొన్నారు.